ఎన్టీఆర్ పై 'రాజకీయం' చేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు?

సినీ పరిశ్రమ అన్న తర్వాత సహజంగానే రాజకీయాలు ఉంటాయి. ఒకరు పైకి ఎదుగుతుంటే వెనక నుంచి వారిని కిందకు లాగేందుకు 100 మంది ప్రయత్నిస్తుంటారు. ఇది ఒక సినీ పరిశ్రమకే కాదు.. అన్ని రంగాలకు వర్తిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పై కూడా రాజకీయాలు షురూ అయ్యాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్న తారక్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ముంబయిలోని ఓ హోటల్ లోకి ఎన్టీఆర్ ప్రవేశిస్తున్న సమయంలో కెమెరామెన్ రికార్డ్ చేశాడు. అదే సమయంలో తారక్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. కీప్ ఇట్ బ్యాక్ అంటూ గట్టిగా అరిచాడు. దీంతో బాలీవుడ్ మీడియా తారక్ పై దుమ్మెత్తి పోసింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరో స్థాయికి ఎదిగిన తారక్ కు అంత కోపం పనికిరాదంటూ ట్రోల్ చేసింది. అయితే అలా తారక్ ఎందుకు అరవాల్సి వచ్చింది అనే విషయమై స్పష్టత వచ్చింది.

bollywood heros doing politics on Junior NTR

తాను పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతున్నానని, అటువంటి సమయంలో రికార్డు చేస్తే అవి కూడా రికార్డ్ అవుతాయని, కెమెరామెన్ కు ఈ విషయం అర్థం కాలేదని తారక్ చెప్పారు. రికార్డ్ చేస్తూ తనవెంట పడటంవల్లే అలా అరిచానన్నారు. తారక్ ఇంత స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఇద్దరు బాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. బాలీవుడ్ లో ఉండే ఇద్దరు హీరోలు తారక్ ను తొక్కడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని, డబ్బులిచ్చి మరీ ఆయనపై వెటకారంగా వార్తలు రాయిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నుంచి తారక్ బాయ్ కాట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారంటున్నారు. దీనిపై నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. టాలెంట్ కలిగిన హీరోను ఎవరూ తొక్కలేరని, ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు తమ హీరో లెగుస్తాడంటూ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+