రామ్ చరణ్ హీరోనా..అయితే నటించను : స్టార్ హీరోయిన్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీగా ఇచ్చిన రామ్ చరణ్ .. తన రెండో సినిమా మగధీరతోనే తానేంటో నిరుపించాడు. ఆ తరువాత వరుస హిట్లు కొడుతూ తన స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించాడు. ఇక దర్శక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.
తన నటనతో సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. RRR సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో రామ్ చరణ్‌కు ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడిందంటే ఆయన క్రేజ్ ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే గతంలో ఓ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్‌తో నటించడానికి నిరాకరించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కెరీర్ మొదట్లో బాలీవుడ్‌లో హీరోగా ఎదగాలని భావించిన రామ్ చరణ్..ఒకప్పుడు అమితాబచ్చన్ నటించిన జంజీర్ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేశాడు. ఈ సినిమాను తెలుగులో తుఫాన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత దారుణ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించింది.

అయితే ఆమె కన్నా ముందు ఈ సినిమాలో మరో హీరోయిన్‌ను సంప్రదించారట చిత్ర యూనిట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేను ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించమని అడిగితే రామ్ చరణ్ పక్కన తాను నటించనని చెప్పేసిందట.

దాంతో ప్రియాంక చోప్రాని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే జంజీర్ సినిమా చూసిన ప్రేక్షకులు రామ్ చరణ్ - ప్రియాంక చోప్రాల మధ్య కెమిస్ట్రీ అంతగా వర్క్ అవుట్ కాలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది.












Click it and Unblock the Notifications