రెబల్ స్టార్ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్...
బహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ 22న 'సలార్ పార్ట్ 1 - సీసిఫైర్' సినిమాతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంకా ఆయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 3898 ఎడి', మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. వీటితోపాటు 'సలార్' పార్ట్ 2, సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు కూడా తెరకెక్కున్నాయి. అయితే, వీటన్నింటితో పోలిస్తే మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్ మూవీ అని టీటౌన్ వర్గాల్లో టాక్. ప్రభాస్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్, కెజిఎఫ్ విలన్ సంజయ్‌దత్ నటించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాను ప్రస్తుతానికి 'రాజా సాబ్' అనే టైటిల్‌తో పిలుస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు జతకట్టనున్నారని తెలుస్తోంది. వారు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్. వీరితో పాటు నటులు సత్యరాజ్, జరీనా వాహబ్ కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం ఆయనకు లుక్ టెస్ట్ చేయడానికి నిన్న మారుతి, అతని స్నేహితుడు ఎస్కేఎన్ ముంబై వెళ్లినట్లు మీడియా సమాచారం. సంజయ్ దత్ కొత్త లుక్ అదిరిపోయిందని టీమ్ సభ్యులన్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలో సంజయ్‌దత్ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందట.. ఈ సినిమాలో సంజయ్ క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని అంటున్నారు.

దక్షిణాదిలో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సంజయ్‌దత్ : బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు సంజయ్ దత్. ఆయన తెలుగులో తీసిన చిత్రం చంద్రలేఖ. అది కూడా 1998లో తీసినది. నాగార్జున హీరోగా వచ్చిన తెలుగు సినిమా 'చంద్రలేఖ'లో అతిథి పాత్రలో సంజయ్ దత్ కనిపించారు. అప్పటినుంచి మళ్లీ చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమాల్లో కనిపించారు. అదే 'కె.జి.యఫ్ చిత్రం. కెజిఎఫ్ చాప్టర్ 2'తో దక్షిణాదిలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు సంజయ్. ఈ సినిమాలో అధీరగా ఆయన చేసిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్రతో సంజయ్ దత్ సౌత్‌లో నెగిటివ్ పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. దీంతో ఆయనకు దక్షిణాదిలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ మధ్యే వచ్చిన లియో సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేశారు సంజయ్ దత్. తెలుగులో పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తోన్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో కూడా మెరవనున్నారు. అలాగే, కన్నడ సినిమా 'కేడీ - ది డెవిల్'లోనూ సంజయ్ దత్ కనిపించనున్నారు. తాజాగా ఇక, ప్రభాస్ సినిమాలో నటించడానికి కూడా ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications