ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టగలరా?
టాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. కానీ మీరు చూస్తోన్న ఫొటోలో ఉన్న హీరోయిన్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అందంలో అప్సరస.. నటనతోనూ మంచి మార్కులు కొట్టేసింది. సౌత్ ఇండస్ట్రీలోని క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ఆమె అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు.. కంటెంట్ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు రెడీ అంటూ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే నిరూపించేసింది. మలయాళం, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటించిన ఈ అందాల భామ ఫుల్ పాపులారిటీని సంపాందించుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడిగా నటిస్తోంది. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు.. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ మాళివిక మోహనన్.
కేరళకు చెందిన ఈ బ్యూటీ.. సౌత్ ఇండస్ట్రీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె అయిన మాళవిక.. కేరళలోని కన్నూర్‌లో జన్మించి ముంబైలో పెరిగారు. 2013లో వచ్చిన 'పట్టం పోల్' అనే మలయాళ సినిమాతో సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. దాదాపు ఆరేళ్ల పాటు మలయాళం, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. 2017లో ఇరాన్ చిత్ర దర్శకుడు మాజిద్ మజిది రూపొందించిన 'బియాండ్ ది క్లౌడ్స్' అనే హిందీ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ.

2019లో రజనీకాంత్ నటించిన 'పెట్ట' సినిమాతో తమిళంలో ప్రవేశించారు. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు. ఈ సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. చెప్పాలంటే.. ఈ బ్యూటీకి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యారు. మాళవిక ధనుష్ తో కలిసి మారన్ (తమిళం) చిత్రంలో అదరగొట్టారు. చియాన్ విక్రమ్ తో కలిసి తంగలాన్ (తమిళం)లో అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో ఆమెకు ఎంతో మంది అభిమానులు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'ది రాజా సాబ్' సినిమాతో తెలుగులో నేరుగా అరంగేట్రం చేయబోతున్నారు.
మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. హాట్ ఫోటోషూట్‌లతో తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె తండ్రి కె.యు. మోహనన్ ఒక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కావడంతో, మొదట ఆమె కూడా దర్శకత్వం లేదా సినిమాటోగ్రఫీ వైపు వెళ్లాలని అనుకున్నారు. కొన్ని మినీ ప్రాజెక్ట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ఆమె ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నారు. ఆమె పెళ్లి గురించి నెటిజన్లు అడిగినప్పుడు, "నా పెళ్లి చూడాలనే తొందర ఎందుకు?" అని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications