సిగ్గుండాలి.. " సిలువ "ను ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకొని ర్యాప్ సాంగ్ !
కళకు సరిహద్దులు ఉండవని, ఎలాంటి భావోద్వేగాలనైనా అద్భుతంగా వ్యక్తపరచొచ్చని ఓ భావన ఉంది. కానీ ప్రజల్లో ఉజ్తేజాన్ని నింపుతూ కేవలం వారిని మెప్పించడానికి మాత్రమే కాకుండా సామాజిక స్పృహను సైతం ఇనుమడింపజేసేది కళ. కానీ ప్రస్తుతం కాలంలో చీప్ పబ్లిసిటీ కోసం కళను దుర్వినియోగం చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పిచ్చి కాస్తా ముదిరి హద్దు మీరిందా అని అనుమానం ఓ సాంగ్ ని చూస్తే నిజం అనిపించక మానదు.
కెనడియన్ ర్యాపర్ జెనెసిస్ యాస్మిన్ మోహన్ రాజ్.. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కానీ లేటెస్ట్ గా ఆమె రిలీజ్ చేసిన సాంగ్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. "ట్రూ బ్లూ" అంటూ రిలీజ్ అయిన పాటలో రిలీక్స్, మ్యూజిక్ అనేవి పక్కనపడితే.. ఆ పాటలో ఆమె భంగిమలు, ఆమె వేషధారణ దారుణంగా ఉన్నాయి. లైక్ ల కోసం,వ్యూస్ కోసం ఇలాంటివి ఎన్నో సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పటికీ.. ఏకంగా ఆమె చేసిన మరో పని అందరినీ షాక్ కి గురి చేస్తుంది.

క్రైస్తవులు సిలువను త్యాగానికి ప్రతీకగా భావిస్తూ పవిత్రంగా ఆరాధిస్తారు. కానీ ఈ పాటలో యాస్మిన్ సిలువను అసభ్యంగా వినియోగించడం, అది నాలుకతో నాకడం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెట్టి విన్యాసాలు చేయడం చూస్తే ఏ కేవలం క్రైస్తవులకే కాకుండా సగటు మనిషి కూయడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సున్నితమైన మత విశ్వాసాల విషయంలో ఈ రకంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పాటను బాన్ చేయాలని, ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పలు దేశాల్లో డిమాండ్లు ఊపందుకున్నాయి.
కళను ఒక మార్గంగా ఉపయోగించి సామాజిక సమస్యలపై అవగాహన పెంచాలి కానీ ఈ తరహా ధోరణి సబబు కాదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. క్రియేటివిటీ అనే పేరుతో అసభ్యం, అపవిత్రాన్ని చూపించడాన్ని భరించమంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ అమ్మడిని ఏకిపారేస్తున్నారు. వ్యూస్ కోసం లైక్స్ కోసం ఇంత నీచానికి దిగజారతారా.. ? అని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications