'కన్నప్ప'కు పోటీగా మరో సినిమా రిలీజ్..శివయ్య ఏందయ్యా
భారీ అంచనాలతో తెరకెక్కిన మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాతో పాటు, మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న మరో ఆసక్తికర చిత్రం 'చంద్రేశ్వర' కూడా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అదృశ్య ఖడ్గం' అనే ట్యాగ్‌లైన్‌తో శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో, డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఈ ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రానికి జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించారు. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ 'చంద్రేశ్వర' సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ''శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు 'చంద్రేశ్వర' మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీవన విధానం ఎలా ఉండేది? అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పగలం. ఈ సినిమాకు సంగీతం ప్రధాన హైలెట్‌గా ఉంటుంది. ఇందులో సాంగ్స్ అన్నీ అత్యద్భుతంగా వచ్చాయి. 'ఈశ్వరా.. నా పరమేశ్వరా', 'అఖిల అఖిల' డ్యూయెట్ సాంగ్, 'నమస్తే చిదంబరం' వంటి పాటలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.

సినిమా కూడా సస్పెన్స్, హారర్ అంశాలతో అత్యద్భుతంగా వచ్చిందని, చివరి నిమిషం వరకు ప్రేక్షకులను ఉత్కంఠగా ఉంచుతుందని నిర్మాత పేర్కొన్నారు. ఎలాంటి అశ్లీలత లేకుండా, క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ వారంలో 'కన్నప్ప', 'చంద్రేశ్వర' రెండు భక్తి సినిమాలు పోటాపోటీగా విడుదలవుతుండటం విశేషం. రెండు చిత్రాలు గొప్ప విజయాన్ని సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
-
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
Varanasi ఊచకోత.. కేవలం ఓవర్సీస్లో రైట్స్‌కే అన్ని రూ.కోట్లా? -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ











Click it and Unblock the Notifications