చిన్న సినిమా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..ఓటీటీని షేక్ చేస్తోంది..!
సినిమా థియేటర్‌లో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం అద్భుతమైన విజయం సాధించిన చిత్రాల్లో 'చౌర్యపాఠం' ముందు వరుసలో నిలుస్తుంది. ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పటికే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. పెద్ద స్టార్ల హంగామా లేకుండా, భారీ సెట్టింగుల ఆర్భాటం లేకుండానే, ఈ సినిమా కేవలం తన కథతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది.
ఈ అపూర్వ ప్రేక్షకాదరణకు ప్రధాన కారణాలు ఏమిటంటే... కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, మరియు నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచిన 'చౌర్యపాఠం'తో ఇంద్ర రామ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి.
మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఇంద్ర రామ్, తన రెండవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు భారీ బడ్జెట్‌తో, విభిన్న కథాంశంతో రాబోతున్నట్టు తెలుస్తోంది. తొలి అడుగులోనే తనదైన ముద్ర వేసిన ఇంద్ర రామ్, త్వరలో రాబోయే తన రెండవ చిత్రంతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications