'గేమ్ ఛేంజర్‌'ను నిండా ముంచింది శంకర్ కాదు అతనే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 10) ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. RRR తర్వాత రామ్ చరణ్( సింగిల్ హీరోగా) నటించిన సినిమా కావడంతో 'గేమ్ ఛేంజర్‌'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు అప్పటి వరకు విడుదలైన టీజర్ , పాటలు, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

దీనికి తగ్గట్టే సినిమా ప్రమోషన్స్ సైతం గట్టిగా చేయడంతో 'గేమ్ ఛేంజర్‌' సూపర్ హిట్‌గా నిలుస్తుందని అంతా భావించారు. కట్ చేస్తే సినిమాపై మెగా అభిమానులే పెదవి విరుస్తున్నారు. 'గేమ్ ఛేంజర్‌' కంటే ఆయన నటించిన 'వినయ విధేయ రామ' సినిమానే బాగుంటుందని సెటైర్లు వేస్తున్నారు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి.

cheated by the hype given by Thaman on the movie Game Changer

కథ, కథనం రెండు కూడా బాలేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు సైతం సినిమా బాలేదని తేల్చేశారు. తెలిసిన కథే అయినప్పటికీ, కథను నడిపించడంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌ తర్వాత సినిమా మరింత నీరసం తెప్పించిందని అంటున్నారు. తమన్ ఇచ్చిన పాటలు, బీజీఎమ్ సైతం పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా అభిమానులు దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు సంవత్సరాల పాటు మా హీరో జీవితాన్ని నాశనం చేశారంటూ మెగా ఫ్యాన్స్ దర్శకుడు శంకర్‌పై మండిపడుతున్నారు.రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే సినిమాకు హైప్ పెంచిన తమన్‌పై కూడా మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమన్ స్టేజ్‌ల మీద ఇచ్చే స్పీచ్‌లకు , సినిమాలకు ఏమాత్రం సంబంధం ఉండటం లేదని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.రామ్ చరణ్ సినిమాలో బీజీఎమ్ పర్లేదు కానీ నువ్వు ఇచ్చిన అంత హైప్ లేదని తమన్‌పై అభిమానులు మండిపడుతున్నారు.మొత్తానికి శంకర్ కన్నా తమన్ చెప్పిన మాటలకే ఎక్కవ మోసపోయాం అంటూ మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+