'ఛావా' రికార్డుల మోత.. మేకింగ్ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రూల్స్ లో తెరకెక్కిన చిత్రం 'ఛావా' వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు చేసి..ఈ ఏడాదిలోనే బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా చరిత్రకెక్కింది.
ఆ తర్వాత మూడు రోజుల్లోనే 100 కోట్ల మార్కును దాటింది. తాజాగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీంతో 2025లో రూ. 200కోట్లు రాబట్టిన మొదటి హిందీ చిత్రంగా ఛావా నిలిచింది.

ఇక ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. శంభాజీ మహరాజ్‌గా విక్కీ,ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించి మెప్పించారని సెలబ్రిటీలు, నెటిజన్లు పొగిడేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా మెరిశారు.
6 నెలల కఠోర శ్రమ..
ఛావా చిత్రానికి బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్ తీవ్ర కసరత్తులు చేశారు. దాదాపు 6 నెలలపాటు కఠోర ట్రైనింగ్ తీసుకున్నారు. గుర్రం స్వారీ, కత్తులతో యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మద్దోఖ్ ఫిల్మ్స్ సామాజిక మాధ్యమమైన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.












Click it and Unblock the Notifications