పెళ్లైన హీరోతో రష్మిక- చేతిలో చెయ్యేసి
Rashmika Mandanna: మచ్ అవైటెడ్ బాలీవుడ్ మూవీ.. ఛావా. హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతోంది. విక్కీ కౌశల్ హీరో. ఆయన సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది.
లీడ్ క్యారెక్టర్‌లో నటించాడు విక్కీ కౌశల్. మహారాణి యశోబాయి పాత్రలో మెరిశారు రష్మిక మందన్న. ఔరంగజేబ్ పాత్రను అక్షయ్ ఖన్నా పోషించాడు. అశుతోష్ రాణా, దివ్య దత్త, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువేకర్, నీల్ భూపాళం, ప్రదప్ రావత్.. వంటి భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్.

150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రఖ్యాత ప్రొడక్షన్ హౌస్ మడ్డోక్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ పుష్ప2 తరువాత రష్మిక నటించిన మూవీ కావడం వల్ల హైప్ క్రియేట్ అయింది. పుష్ప2తో 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన ఆమె.. ఛావాతో కూడా ఈ ట్రేడ్ మార్క్‌ను అందుకోవడానికి అవకాశాలు లేకపోలేదు.

ఇంకో రెండురోజుల్లో ఛావా విడుదల కాబోతోన్న నేపథ్యంలో హీరో, హీరోయిన్లు విక్కీ కౌశల్, రష్మిక మందన్న.. ఈ మధ్యాహ్నం మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథుని సేవలో పాల్గొన్నారు. అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులు వారికి సాయిబాబా తీర్థప్రసాదాలను అందజేశారు.
VIDEO | Actors Vicky Kaushal (@vickykaushal09) and Rashmika Mandanna (@iamRashmika) arrive at Sai Baba Temple, Shirdi to offer prayers ahead of release of their film 'Chhaava'.#Chhaava
— Press Trust of India (@PTI_News) February 12, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/HAAsC1SDPK
ఈ సందర్భంగా రష్మిక మందన్న కాలిగాయంతో కనిపించారు. కుడికాలికి కట్టు కట్టుకున్నారు. అడుగు తీసి అడుగు వేయడానికి ఇబ్బంది పడ్డారు. విక్కీ కౌశల్ చేతిని ఆసరాగా తీసుకున్నారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోన్న సమయంలో ఆమె కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 12వ తేదీ నుంచీ ఆమె గాయంతో సతమతమౌతున్నారు.












Click it and Unblock the Notifications