మన మెగాస్టార్ ను ఆవిడ ఇలా అనేసిందేంటీ..?!

మెగాస్టార్ చిరంజీవికి బిగ్ కౌంటర్ పడింది. ఆయన చెప్పిన ఓ మాటకు ట్రోల్స్ మొదలయ్యాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీలు సైతం మెగాస్టార్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. దీని తీవ్రతను బట్టి చూస్తే ఆయన చెప్పిన మాటలు, చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం అయ్యాయనేది అర్థం చేసుకోవచ్చు. వేళ్లూనుకుపోయిన సమస్యను లేదని చెప్పడం చిరంజీవి వంటి స్థాయి మహానటుడికి తగదని చెబుతున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి నిజానికి లేదని, ఇది వ్యక్తిగత అంశమని, ఇండస్ట్రీకి సంబంధం లేదని అన్నారు. దీనిపై ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గట్టిగా స్పందించారు. ఈ వ్యాఖ్యల ద్వారా బాధితురాలిపై నింద మోపడాన్ని ఆమె ఖండించారు. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ కొందరు మహిళల అనుభవాలను పంచుకున్నారు.

Chinmayi Sripaada hits back at Actor Chiranjeevi over casting couch denial in Telugu Film Industry

పరిశ్రమలో వేధింపులు, లైంగిక దోపిడీ కొనసాగుతున్నాయని చిన్మయి స్పష్టం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ ఓ నిరంతర సమస్య అని, ఇది సినీ రంగంలోకి ప్రవేశించే అనేక మంది మహిళలను ప్రభావితం చేస్తుందని అన్నారు. చిరంజీవి వాదనను తోసిపుచ్చారు. ఈ సమస్యను బాధితుల వ్యక్తిగత తప్పిదంగా చూడటం తగదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్ లో కొన్ని సంఘటనలను ఆమె వివరించారు.

సినీ పరిశ్రమలో 'పూర్తి నిబద్ధత' అనే పదానికి వేరే అర్థం ఉందని గాయని చిన్మయి శ్రీపాద స్పష్టం చేశారు. క్యాస్టింగ్ కౌచ్‌ అనేది చాలా విస్తృతంగా ఉందని, మహిళలు ఆ 'పూర్తి నిబద్ధత'ను చూపకపోతే వారికి అవకాశాలు లభించడం లేదని తేల్చి చెప్పారు. ఆంగ్ల విద్య అభ్యసించిన బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి 'నిబద్ధత' అంటే వృత్తి నైపుణ్యం, పనిపట్ల అంకితభావం అని భావిస్తే, అది తప్పు అని ఆమె వివరించారు.

పరిశ్రమలో చాలా మంది పురుషులు తాము కొన్నిటికీ అర్హులమని నమ్ముతూ మహిళల నుండి లైంగిక సహాయాలను డిమాండ్ చేస్తారని చిన్మయి పేర్కొన్నారు. స్టూడియోలో ఓ మహిళా సంగీతకారిణిని లైంగికంగా వేధించడానికి పరిశ్రమలోని ఓ వ్యక్తి ప్రయత్నించాడని ఆమె వెల్లడించారు. ఆ సంఘటనలో ఆమె ఒక సీనియర్ సహాయంతో కాపాడుకుందని, సౌండ్ బూత్‌లో తనను తాను లాక్ చేసుకుందని, ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు.

Take a Poll

ఇలాంటి అసభ్యకర ప్రవర్తనకు పాల్పడేవారు, జననేంద్రియాల ఫోటోలు పంపేవారు, అసభ్యకర లైంగిక చర్యలకు డిమాండ్ చేసే పురుష గాయకులు ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా ప్రేక్షకుల నుంచి మన్ననలు అందుకుంటోన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లెజెండరీ చిరంజీవి తరం నటీనటులు పరస్పరం గౌరవించుకుంటూ, స్నేహితులుగా, కుటుంబ స్నేహితులుగా మెలిగేవారని చిన్మయి గుర్తు చేశారు. ఆయన దిగ్గజాలతో కలిసి పనిచేశారని, స్వయంగా ఆయనే ఓ లెజెండ్ అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+