68ఏళ్ళ వయసులో చిరంజీవి సాహసం: హ్యాట్సాఫ్ మెగాస్టార్!!
మెగాస్టార్ చిరంజీవి.. సినిమాలలో స్వయం కృషితో ఎదిగిన అందరివాడు. చిరంజీవికుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 68 ఏళ్ల వయసులో కూడా యువ ఉత్సాహంతో నటనలో యువ హీరోలకు పోటీ పడడంలో చిరంజీవి ఆయనకు ఆయనే సాటి. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా బిజీలో ఉన్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఓ రేంజ్ లో కష్టపడుతున్నారని సినీ వర్గాలలో టాక్ ఉంది.
చిరంజీవి విశ్వంభర అప్డేట్
డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం చిరంజీవి 68 ఏళ్ల వయసులో సాహసమే చేసి, యువ హీరోలను సైతం షాక్ కు గురి చేస్తున్నారు. ఇంతకీ చిరంజీవి సినిమాలో చేసిన సాహసానికి సంబంధించి అనేక వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

చిరంజీవి సాహసం
విశ్వంభర సినిమాలో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ఇటీవల జరిగిందని సమాచారం. హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన ఆంజనేయ స్వామి విగ్రహం సెట్ వద్ద యాక్షన్ సీన్స్ షూటింగ్లో చిరంజీవి డూప్ లేకుండానే యాక్షన్స్ సీన్ చేసి అందర్నీ అదరగొట్టారు. ఇక యాక్షన్ సీన్ కు సంబంధించి డైరెక్టర్ వశిష్ట కూడా అప్డేట్ ఇచ్చారు. భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేయబోతున్నట్టు డైరెక్టర్ వశిష్ట సోషల్ మీడియాలో వెల్లడించారు.
డూప్ లేకుండానే చిరంజీవి భారీ యాక్షన్ సీన్స్
అయితే ఈ యాక్షన్ సీన్స్ కు సంబంధించి చిరంజీవి ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ సీన్ చేసేందుకు ఒక డూప్ ని తీసుకువచ్చారని అది భారీ యాక్షన్ సీన్ కావడంతో డూప్ ని తీసుకువచ్చామని తనకు చెప్పారని అయితే అలాంటి యాక్షన్స్ సీన్స్ నేనే చేస్తానని చెప్పి, డూప్ వద్దన్నానని చిరంజీవి తెలిపారు.

68 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి డెడికేషన్, సాహసం సూపర్
20, 30 ఏళ్లకే ఏది చేయాలన్నా మావల్ల కాదు అంటున్న మనం.. చిరంజీవిని చూసి చాలా నేర్చుకోవాలి. సినిమా పట్ల ఆయన డెడికేషన్, పనిలో ఆయన కమిట్మెంట్, అన్నిటికి మించి 68 ఏళ్ల వయసులో కూడా తన అభిమానులను అలరించడానికి ఆయన చేస్తున్న సాహసం నిజంగా హ్యాట్సాఫ్..












Click it and Unblock the Notifications