చంటబ్బాయిని కొలికేత్తున్న బుల్లబ్బాయి.. సీన్ లీక్..

అనిల్ రావిపూడి- మెగా స్టార్ చిరంజీవి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫోటో తాజాగా లీక్ అయింది. దీంతో మెగాస్టార్- బుల్లిరాజు కాంబినేషన్ లో క్రేజీ కామెడీ సీన్స్ పడినట్లు తెలుస్తోంది.

మరోవైపు టాలీవుడ్‌ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సీనిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ ఏడాది సంక్రాంతి పండగ కానుకగా రిలీజైన ఈ మూవీ రూ. 300-350 కోట్లు రాబట్టి విక్టరీ వెంకటేశ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో బుల్లిరాజు క్యారెక్టర్ బాగా పేలింది. తన మాట, యాస, నటనతో థియేటర్లలో నవ్వులు పూయించాడు బుల్లిరాజు.

Chiranjeevi and Bulli Raju Set to Deliver Laughs in Anil Ravipudi s Mega 157

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లిరాజు ఉన్న పిక్ సామాజిక మాధ్యమాల్లో లీకైంది. ఈ ఫోటోలో మెగాస్టార్, బుల్లి రాజు నవ్వుతూ కనిపించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో అనిల్ రావిపూడి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Chiranjeevi and Bulli Raju Set to Deliver Laughs in Anil Ravipudi s Mega 157

ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ మూవీ ఓటీటీ కోసం బిగ్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య డీల్ కుదిరిందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ మూవీ 'Mega 157' వర్కింగ్ టైటిల్​ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్లు అఫీషియల్ గా కన్ఫార్మ్ అయింది. చిరు- నయనతార కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్లిద్దరూ 'సైరా', 'గాడ్ ఫాదర్' సినిమాల్లో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరొలియో సంగీతం అందిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు చిరు ఈ మూవీ తర్వాత 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+