చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సంచలన వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ముందుగా శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పట్లో మీడియా ముందుకు వచ్చి ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యానించడంతో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. శిరీష్ నుంచి విడిపోయిన తర్వాత చిరంజీవి ఆమెకు కల్యాణ్ దేవ్ అనే వ్యక్తితో వివాహం చేశారు. మెగా కుటుంబానికి చెందిన అల్లుడు కావడంతో కల్యాణ్ దేవ్ కూడా హీరోగా ఒకటీ అరా సినిమాలు చేశారు. ప్రస్తుతానికి కూడా హీరోగానే కొనసాగుతున్నారుకానీ శ్రీజతో మాత్రం విడిపోయారు. వారిద్దరి మధ్య దూరం పెరిగింది.

శ్రీజ భావ వ్యక్తీకరణ?
అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు. కొద్దిరోజుల నుంచి మాత్రం విడివిడిగానే జీవిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో ఒకటి ఫొటోలను మరొకరు డిలిట్ చేసుకున్నారు. దీంతో వారిద్దరూ విడిపోయినట్లేనని అందరూ నిశ్చయించుకున్నారు. ఈరోజు వరకు కూడా శ్రీజ తన వివాహ బంధం గురించికానీ, ప్రస్తుతం తను ఉన్న స్థితి గురించి కానీ ఎప్పుడూ స్పందించలేదు.. ఏ విషయం వెల్లడించలేదు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాద్వారా తన భావాలను వ్యక్తపరిచింది.

Chiranjeevi daughter sreeja comments on life

ఇతరులు కూడా అదే స్థాయిలో చూస్తారు
ఆమె షేర్ చేసిన పోస్ట్ ప్రకారం ఎవరైనా సరే తమను తాము ఏ స్థాయిలో ఉంచుకుంటారో ఇతరులు కూడా అదే స్థాయిలో చూస్తారని, అలాగే ఆ స్థాయి వాళ్ళనే కలుసుకుంటారని చెప్పుకొచ్చింది. ఎన్ని ప్రశ్నలకైనా తన సమాధానం ఇదేనని పేర్కొంది. దీంతో ఈమె పెట్టిన పోస్ట్ వివాహ జీవితం గురించే అనే చర్చ నెటిజన్ల మధ్య నడుస్తోంది. సోషల్ మీడియాలో తన వివాహ బంధం గురించి వస్తున కామెంట్స్ కు కూడా ఈ పోస్టుతో సమాధానం చెప్పినట్లైందని మరికొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై శ్రీజ స్పష్టత ఇస్తేనే అందరికీ అర్థమవుతుంది. లేదంటే అప్పటివరకు ఎవరికివారుగా వారికి తోచినట్లు భాష్యం చెప్పుకుంటుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+