చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి.. శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్!!
మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు మృతి చెందారు. లంగ్స్ కు సంబంధించి సమస్యతో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ నేడు తుది శ్వాస విడిచాడు. లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న శిరీష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నేడు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో కన్నుమూశారు.
శిరీష్ , శ్రీజల ప్రేమ వివాహం.. ఆపై విడాకులు
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, శిరీష్ భరద్వాజ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో వీరిద్దరి ప్రేమ వివాహం పెద్ద దుమారమే రేపింది. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రభావం ఉందని అప్పట్లో చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టాక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

డాక్టర్ ను పెళ్లి చేసుకున్న శిరీష్, బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకున్న శ్రీజ
శిరీష్ భరద్వాజ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని 2012లో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొన్న శ్రీజ, శిరీష్ ల మధ్య విభేదాలు పెరగడంతో వీరిద్దరూ 2014లో విడాకులు తీసుకున్నారు.ఆపై శిరీష్ భరద్వాజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇటు శ్రీజ కి కూడా మరొకరితో వివాహం జరిగింది. శ్రీజ 2016లో బిజినెస్ మాన్ కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది.
అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి
శ్రీజతో విడిపోయిన తర్వాత 2019లో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ విహానాను వివాహం చేసుకొని చెన్నైలో ఉంటున్నారు శిరీష్ భరద్వాజ్. నేడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి శిరీష్ భరద్వాజ్ మృతికి సంబంధించి షాకింగ్ పోస్ట్ పెట్టింది.
శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్
"శిరీష్ భరద్వాజ్ ఇకలేరు.. ఇప్పటికైనా నీకు శాంతి దొరికింది రా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అయితే ఇండస్ట్రీలో ఈ పోస్ట్ శ్రీజను ఉద్దేశించి పెట్టిందేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications