Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది

తెలుగు సినీ పరిశ్రమలో మొదటి తరానికి చెందిన అగ్ర కథానాయకుడు నందమూరి తారకరామారావు సినిమాల్లో రెండో తరానికి చెందిన అగ్ర కథానాయకుడు చిరంజీవికి బాగా ఇష్టమైన సినిమా ఒకటి ఉంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అనేక సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో చిరంజీవికి అత్యంత ఇష్టమైన సినిమా, ఆ సినిమాపై ఆయనకున్న ప్రత్యేక అభిమానం గురించి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవికి సీనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో 1957లో వచ్చిన'పాండురంగ మహత్యం' అంటే ప్రాణం.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పుండరీకుడి పాత్ర, ఆ పాత్రలో కలిగే పరివర్తన చిరంజీవిని ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ పండించిన భక్తిరసం, ఆయన ఆహార్యం చూసి తాను మంత్రముగ్ధుడనయ్యానని చిరంజీవి పలు వేదికలపై చెప్పారు. కేవలం నటుడిగానే కాకుండా, ఒక భక్తుడిగా ఎన్టీఆర్ ఆ పాత్రలో జీవించిన తీరు తనకు నటన పట్ల మరింత గౌరవాన్ని పెంచిందంటారు.

Chiranjeevi has an immense fondness for a particular element in Senior NTR films something no one would have ever imagined

ఆయన ప్రభావం అసామాన్యం

వీరిద్దరు కలిసి 1981లో 'తిరుగులేని మనిషి' మూవీలో నటించారు. అప్పటికే చిరంజీవి ఎదుగుతున్న స్టార్‌గా ఉన్నారు. తన ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో చిరంజీవి ఎంతో ఉత్సాహపడ్డారు. ఈ సినిమాలో వీరిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ క్రమశిక్షణను, సమయపాలనను దగ్గరుండి గమనించిన చిరంజీవి, ఆ లక్షణాలనే తన కెరీర్‌లోనూ పుణికిపుచ్చుకున్నారు. షూటింగ్ గ్యాప్‌లో ఎన్టీఆర్ తనకు అందించిన సలహాలు తన ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయని ఆయన కృతజ్ఞతతో అప్పుడప్పుడు స్మరించుకుంటారు. చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో సాంఘిక చిత్రాలతో అలరించినప్పటికీ, పౌరాణిక పాత్రల పట్ల ఆయనకు మక్కువ కలగడానికి కారణం ఎన్టీఆర్ గారే.

'దాన వీర శూర కర్ణ'లో ఎన్టీఆర్ పోషించిన మూడు విభిన్న పాత్రలు, ఆ డైలాగ్ డెలివరీ చిరంజీవికి పాఠ్యపుస్తకాలుగా నిలిచాయి. చిరంజీవి కూడా తన సినిమాల్లో పద్యాలు చదివేటప్పుడు లేదా గంభీరమైన సంభాషణలు చెప్పేటప్పుడు ఎన్టీఆర్ బాణీని కొంతవరకు అనుసరించడానికి ప్రయత్నించేవారు. రాముడన్నా, కృష్ణుడన్నా మనకు ఎన్టీఆరే గుర్తొస్తారని, అటువంటి ప్రభావాన్ని సృష్టించడం సామాన్యం కాదని కొనియాడుతుంటారు.

తన వారసుడిగా నిలబడతాడు

ఎన్టీఆర్‌కు కూడా చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. చిరంజీవి సినిమాల్లోని వేగం, ముఖ్యంగా డ్యాన్సుల్లో ఆయన చూపే గ్రేస్ చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయేవారు. చిరంజీవి నటించిన 'ఖైదీ' సినిమా చూసి, తెలుగు సినిమాకు ఒక కొత్త ఎనర్జీ వచ్చిందని ఎన్టీఆర్ ప్రశంసించారు. అలాగే 'మంత్రిగారి వియ్యంకుడు' సినిమాలోని చిరంజీవి నటనను చూసి, తన వారసుడిగా నిలబడగల సత్తా ఉన్న నటుడని ఆయన గుర్తించి, అభినందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+