బాలయ్య సినిమాల్లో చిరంజీవికి బాగా ఇష్టమైన సినిమా
మెగాస్టార్ చిరంజీవికి, నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో 30 సంవత్సరాల నుంచి హోరాహోరీ పోరు నడుస్తుంటుంది. ఇద్దరూ అగ్ర కథానాయకులే. ఎవరికీ ఎవరూ తగ్గరు. అలాగే ఒకరి సినిమాలంటే మరొకరు ఆసక్తి చూపిస్తారు. చాలాసార్లు చిరంజీవి చేయని సినిమాలు బాలయ్య, బాలయ్య చేయని సినిమాలు చిరంజీవి చేశారు. అందుకు కారణం కథ నచ్చకపోవడం, కాల్షీట్లు ఖాళీగా లేకపోవడం. ఫ్యాక్షన్ సినిమాలతో ఒక ట్రెండ్ ను సృష్టించిన బాలయ్య బాటలో ఆ తర్వాత ఎంతోమంది హీరోలు సినిమాలు చేశారుకానీ ఫ్యాక్షన్ సినిమా అనగానే అందరూ బాలకృష్ణనే ఊహించుకునేవారు. మిగతా హీరోలను అంతగా అంగీకరించేవారు కాదు.
ఫ్యాక్షన్ అంటే బాలయ్య సినిమానే
ఇలా బాలయ్య నటించిన ఇండస్ట్రీ హిట్ ఫ్యాక్షన్ సినిమా సమరసింహారెడ్డి అంటే చిరంజీవికి చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో ఈ మాటను చిరు చెప్పారు. అలాంటి సినిమాను తాను కూడా చేస్తే బాగుండేదనిపించిందని చెప్పేవారు. దీనితర్వాత వచ్చిన నరసింహనాయుడు సినిమా కూడా తనకు బాగా ఇష్టమనేవారు. మొత్తంగా బాలయ్య నటించిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమని అటు చిరు అభిమానులకు, ఇటు బాలయ్య అభిమానులకు తెలుసు. ఇద్దరు హీరోల అభిమానులు ఎంతగా కొట్టుకున్నా ఒకరి సినిమాను మరొకరు కచ్చితంగా చూసేవారు.

ఎదుటివారి విజయాన్ని తనదిగా భావిస్తారు
ఎన్ని దశాబ్దాలు గడిచినా, బాక్సాఫీస్ వద్ద ఎంత పోటీ ఉన్నా.. చిరంజీవికి బాలయ్య సినిమాలపై ఉన్న ఆ ఇష్టం, బాలయ్యకు మెగాస్టార్‌పై ఉన్న ఆ గౌరవం మారలేదు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ అరుదైన స్నేహమే నేటి తరం హీరోలకు ఒక గొప్ప మార్గదర్శకం. ఒకరి ప్లస్, మైనస్ పాయింట్లను చర్చించుకుంటూ, ఎదుటివారి విజయాన్ని తన విజయంగా భావిస్తారు. వీరిద్దరినీ స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి ఎంతోమంది హీరోలు వస్తున్నారు. ఒకప్పుడు చిరుకు, బాలయ్యకు అభిమానులుగా ఉన్నవారే నేడు యువ దర్శకులుగా మారి వారితో సినిమాలు తీస్తున్నారు. అలాంటివారిలో బాబీ, అనిల్ రావిపూడిలాంటివారు ముందుంటారు. వీరేకాకుండా పరిశ్రమలో చాలామంది దర్శకులు చిరుకు, బాలయ్యకు అభిమానులే.












Click it and Unblock the Notifications