'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ 100 డేస్ సెంటర్స్ లిస్ట్ ఇదే.. మెగా సునామీ అంటే ఇదే..
ఈ రోజుల్లో ఓ సినిమా వారం రోజులు ఆడటమే గొప్ప.. సినిమా బాగుంటే రెండు వారాలు.. లేదంటే అదే వీకెండ్ లో సర్దేసుకుంటున్న రోజులు.. ఇక ఓ సినిమా 50 రోజులు ఆడటం ఎప్పుడో ఓసారి జరిగేది. దాంతోపాటు ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. విడుదలైన కొద్దిరోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. అది కూడా థియేటర్లలో.. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్స బస్టర్ విజయం సాధించింది.
మెగాస్టార్ చిరంజీవికి సరైన సినిమా పడితే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో నిరూపించిన సినిమా ఇది. మెగాస్టార్ మేనియాకు బాక్సాఫీస్ దాసోహం అయింది. అప్పటివరకూ ఉన్న టాలీవుడ్ రికార్డుల్ని ఈ మూవీ బద్దలు కొట్టింది. కలెక్షన్స్ లో ఏకంగా దేవర , ఓజీ , సలార్ లాంటి చిత్రాలను కూడా దాటేసింది. ఏడు పదుల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించారు. తనదైన శైలిలో డ్యాన్స్ లు, నటనతో మరోసారి వింటేజ్ చిరంజీవిని పరిచయం చేశారు.
'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఫుల్ రన్ లో ఏకంగా రూ. 350 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్ నిలిచింది. అంతేకాకుండా 109 కేంద్రాల్లో 50 రోజులు కూడా పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు ఏకంగా 100 రోజులు కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని మెగాస్టార్ చిరంజీవి అంటే ఏంటో నిరూపించింది. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ రాయలసీమలోని రెండు సెంటర్లలో ఏకంగా 100 రోజులు ఆడింది. కడప జిల్లా మైదుకూరు ప్రాంతంలోని వెంకటేశ్వర థియేటర్ లో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే అదే జిల్లాలోని యర్రగుంట్ల సెంటర్ లో ఉన్న హేమ పిక్చర్ ప్యాలెస్ థియేటర్ లో కూడా ఈ మూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇక ఈ మూవీ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చింది. అలాగే ఓ సారి టీవీలో కూడా టెలీకాస్ట్ అయింది. అయినా థియేటర్లలో విజయవంతంగా రన్ కావడం ఒక్క మెగాస్టార్ చిరంజీవి సినిమాకే చెల్లుతుంది. 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ప్రస్తుతం చిరంజీవి.. బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలాగే వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మరో మూవీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications