విడాకులపై మెగా డాటర్‌కు ఊహించని ప్రశ్న..అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిందిగా

ఈ రోజుల్లో విడాకులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది తమ వైవాహిక జీవితాలకు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య అధికంగానే కనిపిస్తుంది. ఇక సెలబ్రిటీల గురించి అయితే ఈ లిస్ట్ కొంచెం పెద్దదిగానే ఉంది. అమలాపాల్, సమంత , నిహారిక వంటి వారు భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరి జీవనాన్ని సాగిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వార్త సారాంశం ఏమిటంటే..శ్రీజ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకోబోతుందంటూ తెగ ప్రచారం జరుగుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెద్దలను ఎదురించి మరి అతన్ని వివాహం చేసుకుంది. ఆ సమయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లపై శ్రీజ సంచలన ఆరోపణలు చేసింది. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో సంచలనం సృష్టించింది. కూతురు పుట్టిన తరువాత భర్త భరద్వాజ్‌తో విభేదాలు రావడంతో..అతనికి విడాకులు ఇచ్చి..ఇంట్లో పెద్దలు కుదిర్చిన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.

Chiranjeevi s daughter sreeja talk about divorce

శ్రీజ రెండో భర్త కల్యాణ్ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు.తరువాత కొద్దిరోజులకే రెండో భర్త నుంచి కూడా శ్రీజ దూరంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆఫిషియల్‌గా ప్రకటించకపోయినప్పటికీ..శ్రీజ- కల్యాణ్ ఇద్దరు వీడిపోయారని తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడంతో.. పాటు.. ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో..వీరిద్దరూ విడిపోయారని నెటిజన్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీజ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే.

తాజాగా శ్రీజను విడాకుల గురించి ఓ యువతి ఊహించని విధంగా ప్రశ్నించింది. నాకు విడాకులు తీసుకోవాలని ఉంది ..నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే నాతోనే ఉండు అంటున్నాడు నా భర్త .. నేను ఏం చేయాలి? మీరు సలహా ఇవ్వండి అంటూ శ్రీజను సలహా కోరింది. దీనిపై శ్రీజ స్పందిస్తూ.. నిజంగానే అతనితో ఆనందంగా ఉంటాను అంటే అతనితోనే ఉండు ..ఒకవేళ ఉన్నా కూడా నేను అలా ఉండలేను అనిపిస్తే విడాకులు తీసుకో. అది నీ ఇష్టం పూర్తిగా నీ ఇష్టప్రకారమే నువ్వు ముందుకెళ్లు " అంటూ సలహా ఇచ్చింది . దీంతో మెగా డాటర్ శ్రీజ మెచ్యూరిటీ లెవెల్స్‌కి అభిమానులు ఫిదా అయిపోతున్నారు జనాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+