రామ్ చరణ్ విషయమై అల్లు అర్జున్ తో మాట్లాడిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. అనే పేరు గురించి దక్షిణ భారతదేశంలో తెలియనివారుండదరు. నాలుగు దశాబ్దాల నుంచి విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ, తన నటన, నృత్యాలు, పోరాటాలతో ఆకట్టుకుంటుంటారు. ప్రస్తుతం విశ్వంభర చిత్రం చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అయ్యారు. అయితే చెర్రీ చిన్నతనం నుంచి చాలా రిజర్వుడుగా ఉండేవారు. ఇంట్లో, బంధువుల ఇళ్లల్లో ఏదైనా వేడుకలు జరిగినప్పుడు పిల్లలంతా చురుగ్గా డ్యాన్స్ చేస్తుండేవారు. అయితే చెర్రీ మాత్రం తనంతట తాను ముందుకు వచ్చేవాడు కాదు. హీరోగా మారుతున్న సమయంలో కూడా కొంత మొహమాటంతో వ్యవహరించేవాడు. ఎవ్వరితోను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఇలా ఉంటాడు.. సినిమాల్లో డ్యాన్స్ లు, ఫైట్లు బాగా చేస్తాడంటావా? అంటూ అల్లు అర్జున్ తో చిరంజీవి మాట్లాడేవారంట.

అయితే బన్నీ మాత్రం అటువంటిదేమీ లేదని, చరణ్ కుమ్మేస్తాడని, నువ్వేం ఇబ్బంది పడొద్దంటూ చిరంజీవికి అల్లు అర్జున్ ధైర్యాన్నిచ్చేవాడు. ఆ మాటలతో చిరు కూడా ఎంతో ధైర్యంగా ఉండేవారంట. మొత్తానికి రామ్ చరణ్ తన 16వ సినిమాను కూడా ప్రారంభించారు. రేపో మాపో సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా, ఆ తర్వాత గ్లోబల్ హీరోగా మారిపోయారు. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రం పూర్తికావస్తోంది. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగానే రూపుదిద్దుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications