గన్ తో బెదిరించిన చిరంజీవి?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమంది హీరోలు ఉన్నా.. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్పెషల్ క్రేజీ, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. హీరోయిన్ సుహాసిని, చిరంజీవి మంచి మిత్రులు. ఓరోజు సుహాసిని ఇన్ స్టాగ్రామ్ లైవ్ నిర్వహించగా చిరంజీవి వీడియో కాల్ చేశారు.

సుహాసిని అప్పుడు చిరు గొప్పతనాన్ని వివరించారు . కేరళలో అధిరపల్లిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి కారు ముందు వెళ్తుంది.. వెనక కారులో లేడీస్ వస్తున్నామని, ఈలోగా కొందరు ఆకతాయిలు బీరు బాటిల్ తో .. తమపై దాడికి ప్రయత్నించారని, చిరంజీవి తన దగ్గర ఉన్న గన్ తీసుకొని వాళ్లను బెదిరించారనే విషయాన్ని సుహాసిని వెల్లడించారు. ఆ తర్వాత సినిమా యూనిట్ టీం కూడా అక్కడికి వచ్చి తమని రక్షించారని, హీరోయిజం అంటే కెమెరా ముందు చేసేది కాదని.. కెమెరా వెనక కూడా చేసేదని, అలాంటి రియల్ హీరో మా చిరంజీవి అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.

chiranjeevi threatened with gun

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీనికి ముందు విడుదలైన భోళాశంకర్ భారీ డిజాస్టర్ గా నిలవడంతో కథతోపాటు నటీనటుల ఎంపికతో సహా అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూస్తున్నారు. కచ్చితంగా ఈసారి సూపర్ హిట్ కొట్టాలనే తపనతో ఉన్నారు. రెండోసారి సినీరంగంలోకి ప్రవేశించిన తర్వాత ఖైదీనెంబరు 150, వాల్తేర్ వీరయ్య మాత్రమే ఘనవిజయం సాధించాయి. మిగతా చిత్రాలు నిరాశపరచడంతో అభిమానులను ఖుషీ చేయడానికి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+