చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీ డేట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రచ్చ రచ్చ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ మూవీ మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. మెగాస్టార్ మూవీకి హిట్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మూవీ మేకర్స్​ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్​ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. ఈ క్రమంలో అనిల్ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

గతేడాది సంక్రాంతి కానుకగా విక్టరీ వెంకటేశ్ తో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సారి మెగాస్టార్ తో అంతకుమించిన హిట్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే థియేటర్ల దగ్గర టికెట్ ముక్క దొరకడం లేదు. ఇక పండగ సీజన్ అయ్యేంత వరకూ థియేటర్ల వద్ద ఇలానే ఉండే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి గత రెండు చిత్రాలు ప్లాఫ్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే దానికి తగ్గట్టుగానే మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ఓటీటీ డేట్ పై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని కొనుగోలు చేసింది. అయితే ఇటీవల పెద్ద సినిమాలు కూడా రిలీజైన 27 నుంచి 30 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Chiranjeevi s MSG Magic Heads to ZEE5 Stream Mana Shankara Vara Prasad Garu This February

ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీలో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్ లో మెప్పించారు. అలాగే చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. షైన్ స్క్రీన్ బ్యానర్​ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+