ఎన్నో కష్టాలు పడింది: సమంత బాయ్‌ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
ఏడాదిన్నరకు పైగా సినిమాలకు దూరంగా ఉంటున్న అందాల బ్యూటీ సమంత ప్రస్తుతం సొంత బ్యానరులో మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఇందులో హీరోగా ప్రియదర్శి నటించే అవకాశం ఉంది. ఇటీవలే సిటాడెల్ రీమేక్ సిరీస్ హన్నీబన్నీని పూర్తిచేసింది. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ లో నవంబరు ఏడోతేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమంత దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఇంటర్వ్యూలిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు.
స్పృహ తప్పి పడిపోయేది
తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇస్తూ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరు సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నప్పటికీ సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో ఒక్కోసారి సమంత స్పృహ తప్పి పడిపోయేదని, అలా ఎందుకు పడిపోయిందో తెలియక తాము ఆందోళనకు లోనయ్యేవారిమని, భయపడేవారిమని చెప్పారు. షూటింగ్ సెట్ లో ఎన్నో కష్టాలు పడిందని, ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొందని, షూటింగ్ కు అంతా సిద్ధం చేసుకొని కేవలం సమంత కోసమే ఎదురుచూస్తా ఉండేవారిమని రాజ్ చెప్పారు. ప్రస్తుతం రాజ్ నిడిమోరు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

ప్రధాన కారణాల్లో ఫ్యామిలీమ్యాన్ కూడా కారణం
నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణాల్లో ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ చేయడం కూడా ఒకటని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహించారు. నాగచైతన్యతో విడాకులిచ్చిన తర్వాత సమంత రాజ్ తో డేటింగ్ లో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో వార్తలు వచ్చాయి. ఫ్యామిలీమ్యాన్ సిరీసే నాగచైతన్య-సమంత మధ్య తీవ్రస్థాయి విభేదాలకు కారణమైందంటారు. సిటాడెల్ షూటింగ్ సమయంలో సమంత పడిన కష్టాలను రాజ్ ఏకరువు పెట్టడంతో ప్రస్తుతం వీరిపై ఉన్న రూమర్లు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. నెటిజన్లు విభిన్నరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications