అల్లు అర్జున్ - స్నేహారెడ్డి మధ్య విభేదాలు?
తెలుగు సినీ పరిశ్రమలో ముచ్చటైన జంట ఎవరయ్యా? అంటే అల్లు అర్జున్ - స్నేహారెడ్డి అని చెప్పొచ్చు. ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ముచ్చటిస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని రొమాంటిక్ ఫొటోలను కూడా షేర్ చేస్తుంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య తాజాగా విభేదాలు బయటపడ్డాయంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తే వైరలవుతోంది.
వివాహమైన ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకునేవారికి కూడా వీరిద్దరిలా ఎందుకు ఉండలేకపోయామంటుంటారు. అటువంటి అల్లు అర్జున్ - స్నేహారెడ్డి మధ్య విభేదాలు రావడమేంటంటూ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. వేరే ఎవరైనా అసత్య ప్రచారం చేస్తున్నారా? అంటూ ఆరా తీస్తున్నారు. ఇలా ఆరా తీసే క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చిన విభేదాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావని, చిలిపి తగాదాలేనని తేలింది.

భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. వెంటనే కలిసిపోతుంటారు. అయితే తమ పిల్లల విషయంలో ఈ జంట మధ్య ఇప్పటికీ గొడవలు జరుగుతున్నాయంట. అల్లు అర్జున్ తన పిల్లలను ఎంతో గారాబం చేస్తుంటాడు. అయితే స్నేహ మాత్రం ఎవరికివారుగా సొంతంగా ఎదగాలనే ఆలోచనలో ఉంటుంది. ఇలా చేయకపోతే సొంతంగా ఎదగాలనే ఆలోచన వారికి ఉండదని, స్వతంత్రత దెబ్బతింటుందని, ఎట్టి పరిస్థితుల్లో గారాబం చేయవద్దని, అవసరమైనప్పుడు దండించాల్సిందేనని చెబుతుంటుంది. దీనిపైనే భర్తతో వాదనకు దిగినట్లు సమాచారం. భార్యాభర్తలిద్దరూ ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తేనే పిల్లలు ప్రయోజకులవుతారని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. స్నేహ తీసుకున్న నిర్ణయమే సరైందని ఆమెకే మద్దతు పలుకుతున్నారు.












Click it and Unblock the Notifications