పుష్ప2: అల్లు అర్జున్‌తో విభేదాలు.. అమెరికా చెక్కేసిన సుకుమార్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం పుష్ప2. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. సినీ ప్రియులంతా పుష్ప రెండో భాగం ఎప్పుడు వస్తుందా? అల్లు అర్జున్, ఫహాద్ ఫజిల్ మధ్య ఉత్కంఠభరితమైన సన్నివేశాలను ఎప్పుడు చూద్దామా? అంటూ ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో మైత్రీ మూవీస్ పతాకంపై యెర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు.

డిసెంబరు ఆరుకు వాయిదా
వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సన్నివేశాలు సరిగా రాకపోవడంతోపాటు ఐటం సాంగ్ తీయడం కూడా ఆలస్యం కావడంతో డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్ కు ఉన్న వివాదంవల్ల ఈ సినిమాను వాయిదా వేసినట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సినిమాను విడుదల చేస్తే నష్టపోతామనే ఉద్దేశంతోనే నిర్మాత, దర్శకులు డిసెంబరుకు వాయిదా వేశారు. అయితే ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

clashes between pushpa2 hero allu arjun and director sukumar director went to america

సుకుమార్ పై బన్నీ ఒత్తిడి
సాధ్యమైనంత త్వరగా సినిమాను పూర్తిచేసి విడుదల చేద్దామని బన్నీ సుకుమార్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే సన్నివేశాలు బాగా రావాలంటే కొంత ఓర్పు అవసరమంటూ సుకుమార్ చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు బాగా రాని సన్నివేశాలను మళ్లీ మళ్లీ తీస్తున్నారు. ఈ విషయంలో హీరో, దర్శకుడి మధ్య నిర్మాతలు నలిగిపోతున్నట్లు సమాచారం. చివరకు తాము ఎంతైతే బడ్జెట్ కేటాయించామో అంతలోనే షూటింగ్ పూర్తవ్వాలని, అంతకు మించి ఒక్క రూపాయిని కూడా ఖర్చుపెట్టేది లేదని నిర్మాతలు స్పష్టం చేశారు.

అమెరికా చెక్కేసిన సుకుమార్
తాను ఎంత బాగా సినిమాను తీయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నటులు సరిగా సహకరించడంలేదనే అసహనంతో, ఆగ్రహంతో ఇప్పటికే ఒకసారి ఐఫోన్ విసిరికొట్టి సుకుమార్ షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. మరోసారి కుర్చీని విసిరికొట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే సన్నివేశాలు బాగా వచ్చే విషయంలో తాను రాజీపడకుండా సినిమా కోసమే పనిచేస్తున్నప్పటికీ అల్లు అర్జున్ మాత్రం త్వరగా పూర్తిచేయాలని కోరుతుండటంపై సుకుమార్ అసహనంతో ఉన్నారు. ఇదే సమయంలో షూటింగ్ లో పాల్గొనాల్సిన కీలక నటుడికి స్కిన్ ఎలర్జీ రావడంతో వెంటనే సుకుమార్ అమెరికా చెక్కేశారు. మరి ఆయన ఎప్పుడు వస్తారో? ఎప్పుడు షూటింగ్ ప్రారంభిస్తారో నిర్మాతలకే తెలియాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+