కుదరదని తేల్చిచెప్పిన తమన్నా!

తెలుగు సినీ పరిశ్రమలో మిల్క్ బ్యూటీ తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 సంవత్సరాలు దాటి పోయింది. ఎఫ్ 2 సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడికి, తమన్నాకు మధ్య గొడవ జరిగిందంటూ ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇలా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడానికి కారణమేంటో తెలుసుకుందాం.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. లవ్, ఎమోషన్, యాక్షన్, కామెడీ కలగలసి ఈ సినిమాల విజయానికి బాటలు వేశారు. అటువంటి సమయంలో గొడవలు రావడానికి కారణం ఏమిటి అనే విషయంపై డైరెక్టర్ అనిల్ మాట్లాడారు.

clashes between tamannaah and director anil ravipudi

తనకు తమన్నాకి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరగలేదంటూ కొట్టిపారేశారు. అయితే ఆరోజు ఏం జరిగిందో మాత్రం స్పష్టంగా వివరించారు. ఒక రోజు చాలా మంది ఆర్టిస్టులతో కలిసి ఒక సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న సమయంలో.. తమన్నా వచ్చి తన టైం అయిపోయిందని, వెళ్తున్నానని చెప్పింది. తర్వాతరోజు ఉదయం రమ్మని చెబితే మార్నింగ్ నేను జిమ్ కి వెళ్ళాలి కుదరదు అని చెప్పినట్లు అనిల్ వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్లీ కలిసిపోయిన్లు తెలిపారు. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. తమన్నా రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్‌లో నటించింది. లస్ట్ స్టోరీస్ 2 అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ ఈమధ్యనే బాలకృష్ణతో భగవంత్ కేసరి సూపర్ హిట్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+