పుష్ప2: అమెరికా నుంచి వచ్చినా సుకుమార్‌ను కలవని అల్లు అర్జున్?
మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం పుష్ప2. మైత్రీ మూవీస్ పతాకంపై యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్, యెర్నేని నవీన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి భాగం తెలుగులోకన్నా హిందీలో ఎక్కువగా విజయం సాధించడంతో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి వచ్చే నెల 15నే సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనూహ్యంగా డిసెంబరు ఆరోతేదీకి వాయిదావేశారు.
మెగా అభిమానులతో గొడవ
ఏపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులతో వివాదం రేకెత్తడం, మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం పెరగడంతో నిర్మాతలు ముందు జాగ్రత్తగా సినిమాను వాయిదా వేశారు. ఈలోగా సినిమాలో సరిగా రాని సన్నివేశాలను మళ్లీ తీయాలని సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. కొన్నింటిని షూట్ చేశారు. అయితే నిర్మాతలు మాత్రం తాము ఎంతవరకైతే బడ్జెట్ ను కేటాయించామే అంత పరిమితిలోనే సినిమాను తీయాలని దర్శకుడికి ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఐటం సాంగ్ కూడా తీయాల్సి ఉంది.

కొనసాగుతున్న విభేదాలు
సినిమా విడుదల విషయంలో అల్లు అర్జున్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన దర్శక, నిర్మాతలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. అలాగే సుకుమార్, బన్నీ మధ్య చిన్న చిన్న విభేదాలు చోటుచేసుకుంటున్నట్లు కూడా సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. వీటిని చిత్ర యూనిట్ ఖండించలేదు. ఫాహద్ ఫజిల్ కు స్కిన్ ఎలర్జీ రావడంతో ఇటీవలే సుకుమార్ అమెరికా వెళ్లారు. ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటికీ హీరో అల్లు అర్జున్ మాత్రం కలిసే ప్రయత్నం లేదు. దర్శకుడికి, హీరోకు విభేదాలు కొనసాగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందా? లేదా? అనే సంశయంలో బన్నీ అభిమానులున్నారు. బన్నీ సుకుమార్ ను ఎప్పుడు కలుస్తారు? ఎప్పుడు మాట్లాడుకుంటారు? ఎప్పుడు ఐటం సాంగ్ తీస్తారు? ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుంది? ఎప్పుడు సినిమా విడుదలవుతుంది? అనే విషయాలు భగవంతుడికే తెలియాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications