గెస్ట్ హౌస్‌కు రమ్మని హీరోయిన్‌కు వేధింపులు
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది. తాజాగా మరో హీరోయిన్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పుకొచ్చింది. కలర్ ఫొటో ఫేం చాందిని చౌదరి తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి తాజాగా ఓ ఇంటర్య్వూలో తెలిపింది.
చాందిని చౌదరికి ఒకరోజు కొత్త నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిందట. ఆ మెసేజ్‌లో గెస్ట్ హౌస్‌కు రావాలని.. లేకుంటే తన ఫోటోలు, వీడియోలు మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారట. ఆ మెసేజ్ చూసిన చాందిని ఏం చెయ్యాలో తెలియక తెగ ఏడ్చేసిందట. దీని గురించి ఎవరికి చెప్పలో తెలియక తనలో తాను తెగ బాధపడిపోయిందట. ధైర్యం చేసి ఇండస్ట్రీలో తన స్నేహితులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వాళ్ళు మొదట ఆ నెంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడితే ఆ మేసేజ్ చేసింది ఎవరో తెలిస్తుందని సలహా ఇవ్వడంతో .. ఆ నెంబర్‌కు కాల్ చేయగా..ఓ లేడీ లిఫ్ట్ చేసి మాట్లాడటంతో చాందిని కంగుతిందట.

చాందినిని గెస్ట్ హౌస్‌కు రామ్మని మేసేజ్ చేసి బెదిరించింది మరెవరో కాదు స్నిగ్ద. ఇండస్ట్రీలో టామ్ బాయ్ గా పేరు తెచ్చుకుంది నటి స్నిగ్ధ. ఇలా స్నిగ్ధ చాందిని చౌదరిని సరదాగా ఏడిపించిందట. అయితే అసలు విషయం చెప్పిన తర్వాత చాందిని నువ్వెక్కడున్నావ్ అని అడిగిందట.. పాలనా ప్లేస్ లో ఉన్నాను అని చెప్తే అక్కడికి వచ్చి లాగిపెట్టి కొట్టిందట అదే విషయాన్ని స్నిగ్ధ స్వయంగా చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications