బడా ఫ్యామిలీకి కోడలిగా వెళ్లబోతున్న కమెడియన్ కూతురు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని కమెడియన్స్ కు సైతం ఒక్కో స్లాగ్ ఉంటుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ సంపాదించారు పృథ్వీరాజ్. ఎన్నో చిత్రాల్లో కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పింంచారు. ఆ తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే రాజకీయ రంగంలో ఎదురు దెబ్బలు తగలడంతో వాటికి దూరం జరగడం ప్రారంభించారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
అవకాశాలు వచ్చిన వాటిని చేజారనివ్వకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తన కుమార్తె శ్రిలు ను హీరోయిన్ గా లుగు తెరకు పరిచయం చేస్తూ తానే దర్శకత్వం వహించబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తెతో కలిసి పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలు పెళ్లి ప్రస్తావనతో పాటు పలు విషయాలను ఆయన తెలియజేశారు.

కొంతకాలంగా శ్రీలు ఒకరితో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. మీరు ఒక స్టార్ ఇంటికి కోడలు కాబోతున్నారా? అంటూ శ్రీలు ను ప్రశ్నించగా అందుకు ఆమె సిగ్గుపడుతూ ఉండటంతో పృథ్విరాజ్ ఈ విషయాలపై చర్చించారు అయితే ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది? ఏ ఇంటికి కోడలుగా వెళ్లబోతోంది అనే విషయాలను ఆ వీడియోలో పూర్తిగా మ్యూట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే ఆ ఎపిసోడ్ పూర్తిగా టెలికాస్ట్ కావాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications