మోహన్‌బాబు కాలేజ్‌లో గొడవ... విష్ణు టార్గెట్ గా విద్యార్థులకు మనోజ్ మద్దతు
తెలుగు సినీ పరిశ్రమలో మంచు మోహన్ బాబు అంటే క్రమశిక్షణ కు మారుపేరు. అనేకరకాల పాత్రలను పోషించి విలక్షణ నటుడు అనిపించుకొని కలెక్షన్ కింగ్ అయ్యారు. దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఆయనకు మంచు విష్ణు, మంచు మనోజ్ తోపాటు మంచు లక్ష్మి సంతానం. తండ్రి వారసత్వాన్ని కొడుకులిద్దరూ కొనసాగిస్తున్నారు. విష్ణు ప్రస్తుతం భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా తీస్తున్నారు. మంచు లక్ష్మి, మంచు మనోజ్ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మనోజ్ అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. కొంతకాలం క్రితమే ఆయన భూమా మౌనికను పెళ్లి చేసుకొని తండ్రి అయ్యారు.
మోహన్ బాబు యూనివర్సిటీలో ఆందోలన
కొంతకాలం మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఇద్దరూ ఒకరిమీద మరొకరు చేయి చేసుకునేంతవరకు వెళ్లింది. మంచు లక్ష్మి జోక్యంతో గొడవ సద్దుమణిగింది. తాజాగా మోహన్ బాబుకు తిరుపతిలో ఉన్న మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీలో వివాదం తలెత్తింది. యూనివర్సిటీలో ఫీజలు, ఇతర ఖర్చుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారంటూ వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి.

విద్యార్థులకు మద్దతుగా మనోజ్
ఇటువంటి తరుణంలో రంగంలోకి దిగిన మంచు మనోజ్ విద్యార్థుల తరఫున వకల్తా పుచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రి గొప్ప ఆశయంతో విద్యాసంస్థలను ఏర్పాటు చేశారని, విలువలతో నడిపిస్తున్నారంటూ మనోజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పనులు విష్ణు చూస్తున్నాడు. విష్ణు జోక్యంవల్లే యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితి తలెత్తిందనేది మనోజ్ అభిప్రాయంగా ఉంది.
I’ve been made aware of concerns at @IVidyanikethan #MBUniversity from it deeply saddens me. My father, Chancellor Sri Dr. Mohan Babu garu, has always prioritized the well-being of students and the Rayalaseema community, which is reflected in the success of these institutions.…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 14, 2024
జరుగుతున్నవన్నీ మోహన్ బాబుకు తెలియకుండానే జరుగుతున్నాయనే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నాడు. మనోజ్ ఎక్కడా తన ట్వీట్ లో విష్ణు ప్రస్తావన తీసుకురాలేదు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తన మద్దతు ఉంటుందని, ఈ ఆరోపణలపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను వివరణ కోరానని, వారు ఇంకా సమాధానం ఇవ్వలేదని మనోజ్ తెలిపారు. ప్రస్తుతం దీనిపై మోహన్ బాబుకానీ, విష్ణుకానీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications