చిరంజీవి పేరు, ఫొటోలు వాడొద్దని కోర్టు ఆదేశాలు..
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. మెగాస్టార్ చిరంజీవి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన ఫొటోలు, బిరుదులు, వాయిస్, చిత్రాలను వాడుకోకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్.శశిధర్ రెడ్డి ఇంటెరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇకపై చిరంజీవి పేరు, ఫొటో, బిరుదులు, వాయిస్, చిత్రాలను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులను మంజూరు చేశారు. తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు అక్టోబర్ 27కు వాయిదా వేసింది. తాజాగా కోర్టు నిర్ణయంతో మెగాస్టార్ చిరంజీవి పేరును, ఇమేజ్, వాయిస్, ఫొటోలను అనధికారికంగా వాడటం లేదా ఏఐ సాంకేతికతను వినియోగించి సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలని పేర్కొంది.

అనేక కంపెనీలు, సంస్థలు, సామాజిక మాధ్యమ ఖాతాలు.. చిరంజీవి అనుమతి తీసుకోకుండా ఆయన చిత్రాలను, ఏఐ సాంకేతికతతో సృష్టించిన చిత్రాలు, పోస్టర్లు ఇతర వస్తువులను విక్రయిస్తున్నారని చిరంజీవి తరఫు న్యాయవాది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వివరించారు. వీటివల్ల చిరంజీవి ప్రతిష్ఠ దెబ్బతింటుందని తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న మెగాస్టార్, బాస్, అన్నయ్య, చిరు.. తదితర ట్యాగ్ లకూ ఇది వర్తిస్తుంది. అలాగే టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్ ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలి. ఇక తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు అక్టోబర్ 27కు వాయిదా వేసింది.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications