"చాలా ఇష్టం మీరంటే నాకు.. హ్యాపీ బర్త్ డే"
ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని హీరో లేదా హీరోయిన్ కావాలని చాలా మంది యూత్ కలలు కంటుంటారు. అలా వారి టాలెంట్ ను తొలుత ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యుబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నిరూపించుకుని ఆ తర్వాత వెండితెరకు పరిచయం అవుతారు. అలా తమ టాలెంట్ నిరూపించుకుని సినిమా ఛాన్సులు కొట్టిన వారు చాలామందే ఉన్నారు. అందులో కాకినాడకు చెందిన శ్రీదేవి అలియాస్ శ్రీదేవి అప్పాల ఒకరు.
కోర్టు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన శ్రీదేవి.. తొలి సినిమాతోనే తన నటనతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఈ మూవీలో జాబిలి పాత్రలో శ్రీదేవి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు. తొలి సినిమాకే ఎంతో పరిణతితో కూడిన నటనను ఆమె ప్రదర్శించింది. దీంతో ఆమెకు ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఓ తమిళ్ మూవీలో శ్రీదేవి నటిస్తోంది.
ఇక ఇటీవల ఆమె నటనకు గాను ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ కు ఆమెను ఆహ్వానిస్తూ గామా అవార్డ్స్ బృందం ఓ సందేశం పంపింది. ఇటీవల ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే తనకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం అని ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలో చెప్పింది జాబిలి. అవకాశం ఉంటే ఆయన్ను ఒక్కసారైనా కలవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది శ్రీదేవి.

అయితే ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో తనదైన శైలిలో జాబిలి విషెస్ పెట్టింది. హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు. మీరంటే నాకు చాలా ఇష్టం అని ఉన్న ఓ వీడియోను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది శ్రీదేవి. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications