'కోర్ట్' మూవీ రివ్యూ.. అదొక్కటే మైనస్..!
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రమే 'కోర్ట్'. రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించగా, శివాజీ, ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి ఆపల్లా, వడ్లమాని సాయి శ్రీనివాస్,, శుభలేఖ సుధాకర్, రోహిణి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.ఇన్నేళ్ల కెరీర్‌లో ఈ సినిమా తప్పకుండా చూడండని ఎవర్నీ అడిగింది లేదు.. మొదటిసారి అడుగుతున్నా కోర్ట్ సినిమా చూడమని చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశారు నాని. ఇదే సమయంలో విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.భారీ అంచనాలు మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన కోర్ట్ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ:
చందు అనే కుర్రాడు ఇంటర్ ఫెయిల్ అయి ఖాళీగా తిరుగుతుంటాడు. ఇదే సమయంలో ఆ గ్రామానికి చెందిన జాబిలితో ప్రేమలో పడతాడు.ఈ విషయం తెలుసుకున్న జాబిలి వాళ్ళ నాన్న తన కూతురికి చందు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకున్నాడనే ఉద్దేశంతో అతనిపై చట్టాన్ని ప్రయోగిస్తాడు.చట్టంలో ఉన్న లోపాలను తనకు అనుకూలంగా మార్చుకుని అతని మీద పాక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తాడు.దీంతో చందుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతని కేసును వాదించడానికి ఏ లాయర్ ముందుకు రారు. అటువంటి సమయంలో సూర్య తేజ (ప్రియదర్శి) ఈ కేసును వాదిస్తాడు.చందుని నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి సూర్య తేజ ఏం చేశాడు ?. ఎలాంటి వాదన చేశాడు ?, ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
చట్టంలో ఉన్న లోపాలపై దర్శకుడు రామ్ జగదీష్ ఈ కథను అల్లుకున్నాడు.ముఖ్యంగా పాక్సో చట్టంకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులకు తెలిసేలా కథను రాసుకున్నాడు.అయితే ఈ సినిమాని మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు , రెండో భాగానికి వచ్చే సరికి కాస్తా తడబడినట్టు అనిపిస్తోంది. సెకండ్ హఫ్‌కి వచ్చే సరికి సినిమా కొంతవరకు సైడ్ ట్రాక్‌కి వెళుతుందా అనే అనుమానం కలుగుతుంది. సినిమాని కొత్త గా ప్రజెంట్ చేయాలని అనుకున్నప్పటికి ఇందులో కొంత వరకు బోర్ కొట్టే సన్నివేశాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌ని చాలా ఎంగేజింగ్‌గా తీసుకెళ్లాడు.సెకండ్ హాఫ్‌లో మాత్రం కోర్టు డ్రామా నడుస్తున్నప్పటికి మనల్ని సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే సీన్ ఒకటి కూడా రాలేదు. సినిమా చూశాక ఈ మూవీలో ఏదో ఒక అసంతృప్తితో ప్రేక్షకులు బయటికి వస్తాడు.ప్రేక్షకుడి ఎమోషన్స్‌ను ఫుల్ ఫిల్ చేయలేదనే భావన కలుగుతోంది.

పర్ఫామెన్స్:
చందు పాత్రలో నటించిన హర్ష రోషన్ తన పాత్రతో ఆకట్టుకున్నాడు. ఇక కొడుకు కోసం నిస్సహాయ స్థితిలో ఉండిపోయే పేరెంట్స్‌గా నటించిన చందు పేరెంట్స్ కూడా చాలా బాగా నటించారు. నటి రోహిణి తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక ఈ సినిమాకు శివాజీ నటన ప్రధాన బలం. మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు.ప్రేమించిన ప్రియుడు తన వల్ల జైలుకు వెళ్లాడనే బాధపడుతున్న జాబిలి పాత్రలో శ్రీదేవి చక్కగా నటించింది. తెర మీద తనదైన ఎమోషన్స్‌తో శ్రీదేవి ఆకట్టుకుంది. లాయర్ సూర్యతేజగా ప్రియదర్శి తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. తన పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు.కొంతవరకు ప్రియదర్శి సినిమా మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన క్యారెక్టర్ లో ఉన్న సమర్థ్యాన్ని బయటికి తీసే సన్నివేశాలు అయితే ఏమీ పడలేదు. మిగతా నటీనటులు చాలా రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

సాంకేతిక విభాగం :
విజయ్ బుల్గానిన్ ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. 2013లో జరిగే ఈ కథకు కెమెరామెన్ మంచి విజువల్స్ అందించారు. కోర్ట్ సెట్ కూడా ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గస్థాయిలో ఉన్నాయి. నిర్మాతగా నాని టేస్ట్ ఏంటో మరోసారి అందరికీ అర్థం అవుతుంది. నిర్మాతగా నాని ఓ మంచి సబ్జెక్ట్, పాయింట్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు.
ఫైనల్‌గా:
వినోదం పంచడం కోసం, కమర్షియల్ యాంగిల్‌లో కొన్ని సినిమాలు వస్తుంటాయి. కానీ ఈ తరహా కథలు రేర్‌గా వస్తుంటాయి. సమాజంపై బాధ్యత ఉన్న మేకర్స్ మాత్రమే ఈ తరహా సినిమాలు తీయగలరు.చదువుతోపాటు చట్టం కూడా తెలియాలి అనే పాయింట్‌తో వచ్చిన ఈ సినిమాను ప్రతి ఒక్కరు తప్పక చూసి ఆదరించాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications