వార్ 2 నుంచి క్రేజీ అప్‌డేట్‌..మూవీ ఫ‌స్ట్ లుక్ డేట్ వ‌చ్చేసింది..!

ఎన్‌టీఆర్ కీల‌క‌పాత్ర పోషిస్తున్న వార్ 2 చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్ అందింది. ఎన్‌టీఆర్ తొలిసారిగా న‌టిస్తోన్న బాలీవుడ్ చిత్రం వార్ 2. ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ వ‌చ్చినా అది కాస్తా సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారుతుంది. తాజాగా ఇప్ప‌డు ఆ సినిమా గురించి మ‌రో న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఈనెల 20వ తేదిన ఎన్‌టిఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా వార్ 2 సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ న్యూస్ కాస్త నెట్టంట తెగ వైర‌ల్ అవుతోంది.

మే 20న ఎన్‌టిఆర్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అభిమానుల‌కు ఆరోజు పండుగరోజు. కాబట్టి, ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల నుండి ఈ రోజు అప్డేట్స్ రానున్న‌ట్లు తెలుస్తోంది. అదేరోజు ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్‌టీర్ చేస్తున్న NTR 31 సినిమా నుండి అప్డేట్ రానుందని సోష‌ల్‌మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఇప్ప‌డు వార్ 2 చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ కూడా అదే రోజు రీలీజ్ కానుంద‌ని మ‌రో వార్త వైర‌ల్ అవుతుంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌నా రాలేదు.

Crazy update from War 2 Movie first look date has arrived

మే 20న ఎన్‌టీఆర్ పుట్టిన‌రోజున మూవీ అప్‌డేట్స్‌..

వార్ 2 సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ కూడా న‌టిస్తున్నారు. ఈ సినిమాతో ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో అడుగు పెట్ట‌బోతున్నారు. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా షూట్ లో కూడా పాల్గొన్నారు ఎన్‌టీఆర్‌. ఆ షూటింగ్‌కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక‌, ఈ సినిమాతో పాటు తెలుగులో దేవ‌ర సినిమా షూటింగ్‌లో కూడా ఎన్‌టీఆర్ ఫుల్ బిజిగా ఉన్నారు.

ఈ సినిమా అక్టోబ‌ర్ 10న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఇక‌, మే 20న ఎన్‌టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి కూడా అప్‌డేట్ రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక, ఇందులో అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+