నేడు పెళ్లి పీటలు ఎక్కుతున్న దగ్గుబాటి అభిరామ్...
నేడు దగ్గుబాటి ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. హీరో రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ రోజు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంకలో జరగనుంది. తన దగ్గరి బంధువైన ప్రత్యూషను దగ్గుబాటి అభిరామ్ ఈ రోజు పెళ్లిచేసుకోబోతున్నారు. ఇటీవలే ప్రత్యూషతో అభిరామ్ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ రోజు పెళ్లి వేడుక ఎంతో వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య శ్రీలంకలో జరగబోతోంది. దగ్గుబాటి వారి కుటుంబంలో ఈ ఏడాది జరుగుతున్న రెండో శుభకార్యమిది. ఇప్పటికే దగ్గుబాటి కుటుంబమంతా శ్రీలంక చేరుకున్నారు.
శ్రీలంకలోని కలుతర పట్టణంలోని అనంతర కలుతర రిసార్ట్స్‌లో ఈరోజు రాత్రి 8.50 గంటలకు ప్రత్యూష చాపరాల, అభిరామ్ పెళ్లి వేడుక జరగనుంది. ఈ రోజు రాత్రికి ఈ జంట ఒక్కటవ్వబోతున్నారు. వధువు ప్రత్యూష దగ్గుబాటి కుటుంబానికి చాలా దగ్గరి బంధువు. అభిరామ్ చినతాత కూతురికి కూతురే ఈ ప్రత్యూష. అంటే, వరసకు మరదలు అవుతుంది. రెండు రోజుల నుంచే అభిరామ్ పెళ్లికి సంబంధించిన వార్తలు బయటికొచ్చాయి.

హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌లోనే ముగించుకున్నారు. ఇక పెళ్లి తంతు కోసం శ్రీలంకలోని లగ్జరీ రిసార్ట్స్ అయిన అనంతర కలుతర రిసార్ట్స్‌కు వెళ్లారు. పెళ్లి అనంతరం దగ్గుబాటి కుటుంబం శ్రీలంక నుంచి బయలుదేరబోతున్నట్లు సమాచారం. రేపు సాయంత్రానికి అందరూ హైదరాబాద్ చేరుకుంటారట. ఈ పెళ్లికి సుమారు 200 మంది అతిథులు వస్తున్నట్లు సమాచారం. అయితే, అభిరామ్ పెళ్లి ఎలాంటి హడావిడి, హంగు అర్బాటాలు లేకుండా సింపుల్‌గా డెస్టినేషన్ మ్యారేజ్ చేస్తున్నారు.
అహింస సినిమాతో పరిచయమైన అభిరామ్ : దగ్గుబాటి అభిరామ్ అహింసతో సినీ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించారు. అహింస సినిమాతో అభిరామ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. కానీ, ఈ సినిమా ఆశించినంత ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో హీరో వెంకటేష్ రెండో కుమార్తె హవ్య వాహిని నిశ్చితార్థ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది హాజరయ్యారు. ముందు ఈ ఎంగేజ్‌మెంట్ విషయాన్ని గోప్యంగా ఉంచినా, తర్వాత ఆ వేడుక ఫోటోలు బయటికి వచ్చాయి. హవ్య వాహిని పెళ్లి వచ్చే ఏడాది మార్చిలో జరగబోతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications