Dance Icon Season 2: అస్సలు తగ్గేదేలే డ్యాన్స్ షో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డ్యాన్స్ ప్రియులకు అదిరిపోయే న్యూస్. డ్యాన్స్ లవర్స్ ను ఉర్రూతలూగించిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 కు కొనసాగింపుగా డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 : వైల్డ్ ఫైర్ పేరుతో సిద్ధమైంది. ఫిబ్రవరి 14 రాత్రి 7 గంటలనుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' వేదికగా ప్రీమియర్స్ కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్, జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ హోస్టులుగా వ్యవహరించనున్నారు.
ఈ మేరకు ఈ షో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒక్కో జడ్జి, మెంటార్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఎనర్జిటిక్ డ్యాన్స్ పర్మామెన్స్, ఈళలు, కేరింతల మధ్య ఈ షో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ.. డ్యాన్స్ ఐకాన్ సీజన్- 2 కేవలం డ్యాన్స్ కాంపిటిషన్ మాత్రమే కాదు.. ఇది ఓ అద్భుతమైన, అందమైన అనుభూతి. ఈ షోలో సీజన్ 1 కు మించిన ట్విస్టులు ఉంటాయి. అత్యద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఉండనున్నాయని తెలిపారు. ఈ సీజన్ వైల్డ్ రైడ్ గా సాగబోతోందని చెప్పారు.

మరోవైపు ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. మనం ఇప్పటివరకూ చూసిన టాలెంట్ అసాధారణం.కంటెస్టెంట్లు అందరూ స్టేజీని వైల్డ్ ఫైర్ ను హీటెక్కించేందుకు రెడీగా ఉన్నారు. ఈ సీజన్ మరచిపోలేని ఘట్టంగా నిలవనుందని తెలిపారు.
శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్ మరో లెవెల్ గా ఉండబోతోందన్నారు. ఈ డ్యాన్స్ పర్మామెన్స్ లు వ్యూయర్స్ కు గొప్ప అనుభూతిని అందిస్తాయని అన్నారు. షో హోస్ట్ ఓంకార్, నటి ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్, యశ్ మాస్టర్, మనాస్ నాగులపల్లి, ప్రకృతి కంబాన్, ఆహా సీఈఓ రవికాంత్ శబ్నవీస్, సీఎంఓ విపిన్ ఉన్ని పాల్గొన్నారు.
ఆడియన్స్ తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కు వ్యక్తిగతంగా ఓటింగ్ వేసే విధంగా ఈ సారి సరికొత్త ఆప్షన్ ను తీసుకొచ్చారు. దీంతో వ్యూయర్స్ ఓటింగ్ ద్వారానే తర్వాతి డ్యాన్స్ ఐకాన్ 2 ఎవరో నిర్ణయించనున్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications