ఎంతకు తెగించార్రా..పోర్న్ సైట్‌లో చిరంజీవి వీడియో వైరల్

టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గతంలో హీరోయిన్ల వీడియోలు మాత్రమే డీప్ ఫేక్ చేసేవారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.

చిరంజీవి ప్రతిష్టకు భంగం కలిగించేలా సైబర్ నేరగాళ్లు హద్దులు దాటి ప్రవర్తించారు. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ..చిరంజీవికి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియోలను సృష్టించి, ఏకంగా వాటిని పోర్నోగ్రఫీ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేశారు.

Deepfake Shock Megastar Chiranjeevi s Videos Misused on Porn Sites Complaint Filed

కొందరు మహిళలతో చిరంజీవి మాట్లాడుతున్నట్లుగా ఉండే ఈ నకిలీ వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో రూపొందించి, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా విస్తృతంగా పోస్ట్ చేశారు.

తన గౌరవ మర్యాదలకు తీవ్ర భంగం కలిగించిన ఈ చర్యపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఆయన, ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను గుర్తించి, కఠినంగా అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీ సజ్జనార్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు పోర్న్ సైట్లలో కనిపించడం దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+