తెలుగు సినిమా వాళ్లంటే 'ఫ్లవర్స్' అనుకుంటివా దీపికా?
తెలుగు సినీ పరిశ్రమ కానీ, ఆ పరిశ్రమకు చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటులు లాంటివారంతా కూడా ఫ్లవర్స్ అనుకుంటివా? దీపికా అని తెలుగు పరిశ్రమకు చెందిన సినీ ప్రియులంతా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్ హీరోలకు, అక్కడి సినిమాలకు ఇచ్చే ప్రాధాన్యతను ఏ భాషకు సంబంధించిన సినిమా ఒప్పుకున్నా అంతే ప్రాధాన్యతనివ్వాలి. కానీ దీపిక పరాయి భాషకు చెందినవారంటే గొంతెమ్మ కోరికలు కోరడం, మన అవసరం ఉంది కదా అని వెనక వచ్చే మందీ మార్బలానికి ఫైవ్ స్టార్ రేంజ్ లో సౌకర్యాలు కల్పించడం అంటే వాటిని డబ్బులనుకుంటివా? చిల్ల పెంకులనుకుంటివా? అందరూ కష్టపడి సంపాదించుకున్న సొమ్మే. షారుక్ ఖాన్ నాకు ఒక సలహా ఇచ్చారు.. దాన్ని ఫాలో అవుతున్నాను.. డబ్బులకన్నా సినిమా ఎవరితో చేస్తున్నామనేదే ప్రదానం అని చెప్పినట్లు తాజాగా ట్వీట్ చేసింది.
ప్రియాంకకు, దీపికకు ఉన్న తేడా ఇదే
తెలుగు సినిమాలపై, అక్కడి నటులపై బాలీవుడ్ ఎంత దుష్ప్రచారం చేస్తుందో అందరికీ తెలిసిందే. వాటన్నింటినీ తట్టుకుంటూ హిందీ బెల్టు ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా సినిమాలు తీస్తున్నారు. చేతనైతే బాలీవుడ్ వారిని కూడా అలాంటి సినిమాలు తీయమని దీపిక చెప్పాలి. ముందు ఒప్పుకొని తర్వాత తన అవసరం బాగా ఉందని గ్రహించిన తర్వాత పారితోషికం పెంచడం, కేవలం ఆరు గంటలు లేదంటే ఏడు గంటలే పనిచేస్తానని చెప్పడం ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికి ఇవి బాగుంటాయికానీ కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరడానికి మాత్రం ఈ లక్షణాలు మైనస్ గా మారతాయి. ప్రియాంకచోప్రా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడానికి ఆమె నిబద్ధత, ఏ సినిమానైనా ఒకేలా చూడటం, వృత్తిని గౌరవించడమే ప్రధాన కారణాలు. కానీ ఆ లక్షణాలు దీపిక దగ్గర ఉన్నాయా? లేదా? అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు.

పీఆర్ టీం ద్వారా కథ లీక్ చేయించింది
దీపిక దగ్గర నిబద్ధత ఉంటే సందీప్ రెడ్డి సినిమా ఒప్పుకున్న తర్వాత కథ మొత్తం విని గొంతెమ్మ కోర్కెలు కోరారు. కానీ వీలుకాదని చెప్పడంతో కథను తన పీఆర్ టీం ద్వారా లీక్ చేయించింది. దీనిపై ఊరుకోవడానికి అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగా. అందుకే దీపికపై రెచ్చిపోయాడు. కనీస విలువలు కూడా పాటించకుండా కథను లీక్ చేసిందని, నీకు నచ్చింది చేసుకోపో అన్నాడు. దీపికాకు బదులుగా తృప్తి దిమ్రిని తీసుకున్నాడు. దీంతో తన స్థానంలో తృప్తిని తీసుకోవడం, ఆమె ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వస్తున్న చిన్న నటి కావడంతో దీపికాకు ఇంకా మండిపోయింది. నీ స్థాయి ఇది అని సందీప్ చెప్పాడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కల్కి2 టీం నుంచి కూడా తిరస్కరణ రావడంతో ఒకసారి తన గురించి తాను ఆలోచించుకొని, ఎక్కడ లోపం ఉందో తెలుసుకొని మంచి నటిగానే కాదు.. విలువలున్న వ్యక్తిగా కూడా పేరు తెచ్చుకోవాలని దీపికా పదుకొనే అభిమానులు కూడా కోరుతున్నారు.












Click it and Unblock the Notifications