అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అద్దిరిపోయే వార్త

Allu Arjun: అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్నారు. పాన్ ఇండియా సినిమా చరిత్రను తిరగరాసిన ఈ మూవీ ఇది. ఐకాన్ స్టార్ నెక్స్ట్ మూవీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. కోలీవుడ్ కు చెందిన అట్లీ దర్శకత్వం వహిస్తోన్న మాస్ ఎంటర్టైనర్ ఇది. అల్లు అర్జున్ కు ఇది 22వ మూవీ. అలాగే- అట్లీకి ఇది ఆరో సినిమా.

ఈ ప్రాజెక్ట్ పై బిగ్ అప్ డేట్ వెలువడింది. ఇందులో దీపికా పదుకొణే నటించనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఓ ప్రోమోను విడుదల చేసింది. దీపికా పదుకొణే ఆన్ బోర్డ్ అంటూ వెల్లడించింది. అలాగే- దీపిక పడుకొణేతో దర్శకుడు అట్లీ.. స్టోరీ డిస్కస్ చేస్తోన్న సన్నివేశాలను ఈ ప్రొమోలో పొందుపరిచింది.

Deepika padukone onboard of Allu Arjun and Atlee movie

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కీ రోల్ లో కనిపించింది దీపిక పడుకొణే. దాని తరువాత ఆమె నటించనున్న మరో తెలుగు మూవీ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్.. ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కబోతోంది అల్లు అర్జున్- అట్లీ మూవీ. పాన్ ఇండియాగా టాలీవుడ్ సత్తాను మరోసారి చాటబోతోంది.

అల్లు అర్జున్- దీపికా పదుకొణే కలిసి పని చేయడం ఇదే తొలిసారి. అట్లీ దర్శకత్వంలో నటించడం ఇది రెండోసారి. అంతకుముందు ఆమె అట్లీ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జవాన్ లో నటించింది. షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ ను పంచుకుంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తో జతకట్టింది.

వారియర్ క్వీన్ రోల్ లో ఆమె మెరుపులు మెరిపించనుంది. కల్కిలో ఎటువంటి కీలక పాత్రను పోషించిందో.. ఇందులో కూడా అంతే ప్రయారిటీ ఉన్న రోల్ ను ఆమె కోసం డిజైన్ చేశాడు దర్శకుడు అట్లీ. ఈ క్యారెక్టర్ ను తీర్చిదిద్దన విధానాన్ని చూసి.. ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీపిక.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+