సందీప్ వంగ కి దీపికా పదుకొణె కౌంటర్..?
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది దీపికా పదుకొణె. అయితే ఇటీవల ఆమె చుట్టూ వివాదాలు కూడా భారీగానే జరిగాయి. ఏకంగా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఒకేసారి వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ కల్కి మూవీతో సౌత్ లోకి అడుగుపెట్టిందీ బ్యూటీ. అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'స్పిరిట్', 'కల్కి-2' సినిమాల నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారిన విషయం తెలిసిందే.
ఇదే విషయంపై అటు స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. అలాగే కల్కి నిర్మాతలు బహిరంగంగానే ఆమెపై మండిపడుతూ అసహనంతో ట్వీట్స్ చేశారు. ఆమె డిమాండ్స్ అధికంగా ఉన్నాయని.. రెమ్యూనరేషన్ కు బదులుగా లాభాల్లో భారీ వాటాలను అడుగుతోందని.. పని గంటలు కూడా బాగా తగ్గిస్తేనే కాల్ షీట్స్ ఇస్తానని, ఇలా రకరకాల డిమాండ్స్ కారణంగా ఆమెను దర్శకనిర్మాతలు తొలగించినట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవల IMDB సంస్థ 2000 సంవత్సరం నుండి 2025 వరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అత్యంత ప్రేక్షకాదరణ సంపాదించుకున్న నటీనటుల లిస్టును ప్రకటించింది. మొత్తం 130 అత్యుత్తమ చిత్రాలు ఎంపికకాగా అందులో 10 చిత్రాల్లో కథానాయికగా నటించి అరుదైన రికార్డు సాధించింది దీపికా పదుకొణె. ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ.. తాను ముక్కుసూటిగా ఉంటానని తెలిపారు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో విజయాలను చూసానని.. అలాగే ఫెయిల్యూర్స్ నూ చూసానని పేర్కొంది. ఈ ప్రయాణం లో తాను ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలిపింది.

వెన్నుపోటు పొడిచేవాళ్లూ ఉన్నారని తెలిపింది. తన సక్సెస్ తోనే వాళ్లకు సమాధానం చెప్తూ వచ్చాను. ఈ ప్రయాణం లో తోడున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకొనే. అలాగే తనకు తప్పనిపిస్తే ఎవరినైనా ప్రశ్నించడంలో వెనుకాడనని.. అవసరమైతే కష్టాల దారినే ఎంచుకుంటానని కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications