పవన్ సినిమాలకే ఎందుకిలా..అక్కడ ‘హరిహర వీరమల్లు’ బ్యాన్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనేక వాయిదాల తర్వాత, ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిఏఎమ్ రత్నం నిర్మించారు. మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్‌లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్నారు.
ఔరంగజేబు కాలంనాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.ఇది దేశభక్తి, వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో (ఔరంగజేబుగా) కనిపించనున్నారు.

ఈ చారిత్రక యాక్షన్ చిత్రం గురువారం అధికారికంగా విడుదల కానుండగా, అభిమానుల కోలాహలం మధ్య బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. అయితే పక్క రాష్ట్రం అయిన కర్ణాటక రాష్ట్రంలో హరిహర వీరమల్లు చిత్రం విడుదల అవుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది.
హరిహర వీరమల్లు బ్యానర్లు కన్నడ భాషలో లేవని చింపిన కన్నడిగులు pic.twitter.com/iQQM16AOVO
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2025
హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న థియేటర్ల వద్ద అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. 'హరిహర వీరమల్లు' బ్యానర్లను కన్నడలో ఎందుకు పెట్టలేదని వారు ప్రశ్నిస్తున్నారు.ఏకంగా పవన్ కళ్యాణ్ పోస్టర్లను చించిపడేశారు. హరిహర వీరమల్లు బ్యానర్లు కన్నడ భాషలో లేవని కన్నడిగులు చించేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది.
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా పోస్టర్లలో కన్నడ భాష లేకపోవడంపై కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ భాషను గౌరవించని పక్షంలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించాయి. ఈ పరిణామంతో కర్ణాటక వ్యాప్తంగా 'హరిహర వీరమల్లు' సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications