ప్లాఫ్ టాక్ తో రూ. 500 కోట్లు కలెక్షన్స్.. స్టార్ హీరో క్రేజ్ అంటే ఇదీ..!
సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కొందరు హీరోలకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సినిమా హిట్, ప్లాఫ్ టాక్ తో సంబంధం లేకుండా వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతుంటాయి. అదంతా ఆ స్టార్ హీరో కు ఉన్న ఫ్యాన్స్ బేస్, క్రేజ్ మాత్రమే. అయితే ఈ ఏడాది ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో స్టార్ హీరో కాంబోలో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే విశేషం ఏంటంటే ప్లాఫ్ టాక్ తోనే ఏకంగా రూ. 500 కోట్లు వసూళ్లు రాబట్టింది. అదీ సూపర్ స్టార్ రేంజ్ అని స్పష్టం అయింది.
సూపర్ స్టార్ రజనీకాంత్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో సినిమా అంటే సగటు సినీ ప్రేక్షకుడికి పండగ అన్నమాటే. ఈ క్రమంలోనే తొలిసారిగా వీరి కాంబోలో కూలీ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఓ రేంజ్ లో బజ్ ఏర్పడింది. మూవీ రిలీజ్ కు ముందే అనిరుధ్ ఇచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా విడుదలైంది. అయితే మూవీ టాక్ మాత్రం నెగటివ్ గా వచ్చింది.
కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం రూ. 500 కోట్లు రాబట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ స్టామినా ఏంటో నిరూపించింది. అయితే ఇదే విషయంపై తాజాగా కూలీ మూవీ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రూపొందించిన కూలీ చిత్రంపై ఎన్నో విమర్శలు వచ్చినట్లు స్పష్టం చేశారు. మూవీపై ట్రోల్స్ వచ్చినా ప్రేక్షకులు ఆదరించారని చెప్పుకొచ్చారు. తన తదుపరి సినిమాలో ఆ తప్పులు చేయకుండా ప్రయత్నిస్తానని తెలిపారు.

ఇక లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఖైదీ-2 స్క్రిప్ట్ పై బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్.. నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
-
విజయ్-త్రిష పెళ్లి? తమిళనాడు ఎన్నికల వేళ అదిరే ట్విస్ట్! -
"అణచివేయాలని కుట్ర.. అయినా నో కాంప్రమైజ్" -
Rajinikanth: రజినీకాంత్‌ను కెలికారు..ఇక విజయ్‌కు చుక్కలే..నాటి సీన్ రిపీట్..!! -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
తెలుగు ప్రేక్షకులు ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లి మరీ చూసిన సినిమాలు ఇవే -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి.. -
ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్ -
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
రెండు ఎలక్ట్రిక్ స్టవ్ లు కొన్నా.. గ్యాస్ కొరత వేళ సూపర్ స్టార్ సంచలనం -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు











Click it and Unblock the Notifications