గద్దర్ అవార్డు విజేతలకు ప్రైజ్ మనీ ఎంత ఇవ్వనున్నారో తెలుసా..?

సుమారు 14 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈసారి ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ జ్ఞాపకార్థంగా.. గద్దర్ అవార్డ్స్ పేరిట ఈ వేడుకలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే 2024 సంవత్సరానికి ఇప్పటికే విజేతలను సైతం ప్రకటించారు. అలానే 2014 నుంచి 2023 మధ్య వచ్చిన సినిమాలకు ఉత్తమ చిత్రం విభాగంలో అవార్డులు అనౌన్స్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను పునరుద్ధరించడం పట్ల సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే విజేతలకు పురస్కారంతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తారు. ఈ క్రమంలోనే గతంలో నంది అవార్డుల కంటే ఈసారి ప్రైజ్ మనీని భారీగా పెంచింది తెలంగాణ సర్కార్. అవార్డుల్లో భాగంగా మొత్తం 73 పురస్కారాలను తెలంగాణ ప్రభుత్వం అందించనుండగా.. ఇందుకోసం ప్రభుత్వం రూ. 4.5 కోట్లు ఖర్చు చేయనుందని సమాచారం. ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారంతోపాటు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ లభించనుంది. అలాగే వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో పురస్కారానికి రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు చొప్పున నగదు అందనుంది. అలాగే ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డుకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నగదు లభించనుంది.

details-about-how-much-prize-money-will-be-given-to-winners-of-gaddar-awards

గద్దర్ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు గానూ, ఒక్కో చిత్రానికి రూ. 10 లక్షలు, రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కోదానికి రూ. 7 లక్షలు, మూడో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి రూ. 5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించనున్నారు.

2024 గద్దర్ ఫిల్మ్ అవార్డుల విజేతలు..

2024 బెస్ట్‌ ఫిల్మ్స్‌ ఇవే..

మొదటి ఉత్తమ చిత్రం: కల్కి 2898ఏడీ

రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్‌

మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్‌

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు

హిస్టరీ - హెరిటేజ్‌ చిత్రం: రజాకార్‌

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్‌

ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్ళు)

ఉత్తమ దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌ (కల్కి)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప 2)

ఉత్తమ నటి: నివేదా థామస్‌ (35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్‌ (రాజు యాదవ్‌- లేదే లేదే ప్రేమసలే)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్‌ (రజాకార్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్‌ శ్రీరామ్‌ (నిజమే నే చెబుతున్నా - ఊరి పేరు భైరవకోన)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (సూసేకి అగ్గిరవ్వ - పుష్ప 2)

ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్‌ (మత్తువదలరా 2)

ఉత్తమ బాలనటుడు: మాస్టర్‌ అరుణ్‌ దేవ్‌ పోతుల (35 చిన్న కథ కాదు), బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్‌)

ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్‌ షాప్‌ మూర్తి)

ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫర్‌: విశ్వనాథ్‌ రెడ్డి (గామి)

ఉత్తమ ఎడిటర్‌: నవీన్‌ నూలి (లక్కీ భాస్కర్‌)

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌: అరవింద్‌ మేనన్‌ (గామి)

ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్ ఆచార్య (ఆయుధ పూజ - దేవర)

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: అద్నితిన్‌ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌: కె. చంద్రశేఖర్‌ రాథోడ్‌ (గ్యాంగ్‌స్టర్‌)

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌: నల్ల శ్రీను (రజాకార్‌)

ఉత్తమ కాస్టూమ్‌ డిజైనర్‌: అర్చనా రావు, అజయ్‌ కుమార్‌ (కల్కి 2898 ఏడీ)

స్పెషల్‌ జ్యూరీ అవార్డులు..

నటుడు: దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)

నటి: అనన్య నాగళ్ల (పొట్టేల్‌)

దర్శకులు: సుజీత్‌, సందీప్‌ (క)

నిర్మాతలు: ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి (రాజు యాదవ్‌)

స్పెషల్‌ జ్యూరీ స్పెషల్‌ మెన్షన్‌: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)

తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: 'మన సినిమా ఫస్ట్‌ రీల్‌' (రెంటాల జయదేవ్‌)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+