30వ రోజు దేవర మాస్ జాతర... డబుల్ ఊచకోత

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన మాస్ ఇమేజ్ తో డబుల్ ఊచకోత కోస్తున్నారు. దేవర సినిమా విడుదలై 30 రోజులవుతున్నప్పటికీ వస్తున్న కలెక్షన్లు చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. అంతగొప్పగా ఆడటానికికానీ, అంత గొప్పగా కలెక్షన్లు రావడానికి కానీ సినిమాలే ఏమీ లేదంటున్నారు. దేవర మొదటి భాగం మాత్రం అదిరిపోయిందని, రెండో భాగం మాత్రం నిరాశపరిచిందంటున్నారు. మిక్స్ డ్ టాక్, సినిమాపై వ్యతిరేక ప్రచారాన్ని తట్టుకొని సూపర్ కలెక్షన్లు రాబడుతోందంటే దానికి కారణం కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ట్రేడ్ పండితులు తేల్చారు.

30వ రోజు రూ.40 లక్షల షేర్
వాస్తవానికి ఏ సినిమా విడుదలైనా మూడువారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న రోజుల్లో కూడా 30వ రోజు ఈ సినిమా గ్రాస్ కాకుండా రూ.40 లక్షల షేర్ ను డిస్ట్రిబ్యూటర్లకు అందించింది. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో కలెక్షన్లు పెరుగుతున్నాయి. కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ వాటి ప్రభావం ఈ సినిమాపై పడటంలేదు. దసరా సీజన్ ను ఈ సినిమా చక్కగా ఉపయోగించుకుంది. గతంలో దూకుడు, అత్తారింటికి దారేది సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఏపీలో దేవర కలెక్షన్లు ఊపందుకున్నాయని డిస్ట్రిబ్యూటర్లు చెబుతుండటం ఆశ్చర్యపరుస్తోంది.

Devara Collections are surprising the film trade Analysts

దీపావళికి రూ.2 కోట్ల షేర్
మొదటి వీకెండ్ కే సినిమా కథ ముగిసిపోతుందని అందరూ అంచనా వేయగా నెలరోజుల తర్వాత వచ్చిన వీకెండ్ కు కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. కేవలం ఎన్టీఆర్ స్టామినావల్లే ఇది సాధ్యపడిందంటున్నారు. దీపావళి వరకు ఈ సినిమా ఇలాగే ఆడుతుందని, అప్పటివరకు రూ.2 కోట్ల షేర్ అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎటువంటి సినిమాలు లేవు. ఇప్పటికే హిందీ రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. నవంబరు నెలలో కూడా ఈ సినిమా ఆడుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. 200 కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోబోతోంది. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ కు అంతటి బ్లాక్ బస్టర్ ను ఈ సినిమా అందించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరైన సినిమా పడితే జూనియర్ స్టామినాకు రూ.1500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+