దేవుడా... ఏంటీ కలెక్షన్లు.. 31.. 62.. 'దేవర' ఊచకోత!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం కలెక్షన్ల విషయంలో సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైన రోజు నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం జరిగినప్పటికీ తారక్ మాత్రం మాస్ లో తనకున్న ఇమేజ్, క్రేజ్ ద్వారా సినిమాను బ్లాక్ బస్టర్ చేశాడు. అంతేకాదు.. ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్ల కలెక్షన్లను దాటింది. దాదాపుగా రూ.600 నుంచి రూ.650 కోట్ల దగ్గర ఆగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు, సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఊచకోత కోసిన ఎన్టీఆర్
విడుదలైన తొలి రోజు నుంచి 19వ రోజు వరకు ఎక్కడా రూ.కోటి తగ్గకుండా కలెక్షన్లు వసూలు చేసింది. సోలో హీరోగా తన కెరీర్ హయ్యస్ట్ కలెక్షన్లను సాధిస్తున్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లందరికీ లాభాలు వచ్చాయి. ఈ క్రమంలోనే నైజాం, సీడెడ్ ఏరియాల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది. నైజాం ప్రాంతంలో 25 రోజులకు రూ.62 కోట్ల షేర్ సాధించింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో రూ.31 కోట్ల షేర్ మార్క్ అందుకొని రికార్డు సృష్టించింది. రాయలసీమ ఏరియా తన అడ్డా అని ఈ నందమూరి హీరో మరోసారి నిరూపించారు. కొందరు హీరోల సినిమాలకు అందని రేంజ్ లో కలెక్షన్ల పరంగా తారక్ ఊచకోత కోశాడు. లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎన్ని కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి.

సగం మార్కులే అందుకున్న కొరటాల
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా జాన్వీకపూర్ నటించింది. అనిరుధ్ రవిచందర్ స్వరాలందించారు. దేవర సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా విజయానికి ఎంతో తోడ్పడింది. దేవర2 సినిమా సిద్ధం చేసే ముందుగా కొరటాల శివ మోహన్ లాల్ తనయుడితో ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. దర్శకుడిగా ఈ సినిమాకు కొరటాలకు సగం మార్కులే పడ్డాయి.












Click it and Unblock the Notifications