ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కుమార్తె..!
సీనియర్ స్టార్ నటి దేవయాని మనందరికీ సుపరిచితమే.. ఆమె తన కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 100 చిత్రాల్లో నటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సుస్వాగతం సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత తమిళం, కన్నడలోనూ పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు దేవయాని.

ఇక దేవయాని పలు హిందీ సినిమాల్లోనూ నటించారు. అలాగే ఓ బెంగాళీ సీరియల్ లో కీలక పాత్రతో మెప్పించారు. అలా దేవయాని 2001లో తమిళ దర్శకుడు రాజ్‌కుమార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. అది దేవయాని తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి ఒక గుడిలో పెళ్లి చేసుకుంది ఆ జంట. ఇక పెళ్లి కావడంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె బుల్లితెరపై దృష్టి సారించారు. అక్కడ రోజుకు రూ. లక్ష రూపాయలు పారితోషికం తీసుకున్న నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు దేవయాని.
టాలీవుడ్ ఎంట్రీకి దేవయాని కుమార్తె సిద్ధం..!
— ChotaNews App (@ChotaNewsApp) April 6, 2026
ఒకప్పటి స్టార్ హీరోయిన్ దేవయాని వారసురాలు ప్రియాంక త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్నారు. త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంజన్’ (కోర్టు రీమేక్) సినిమాతో ఆమె సినీ రంగప్రవేశం చేస్తున్నట్లు దేవయాని అధికారికంగా ప్రకటించారు. తన… pic.twitter.com/9HGfxSixMP
ఇప్పుడు యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా నటిస్తున్నారు దేవయాని. అయితే ఇప్పుడో షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. దేవయాని కుమార్తె ప్రియాంక త్వరలోనే వెండితెరకు పరిచయం కానున్నట్లు సమాచారం. త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంజన్'(కోర్టు రీమేక్) సినిమాతో ఆమె సినీ రంగప్రవేశం చేస్తున్నట్లు దేవయాని అధికారికంగా ప్రకటించడం విశేషం. తన కుమార్తె అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం రాణిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేవయాని ఇటీవలే విడుదలైన 3BHK సినిమాలో హీరో సిద్ధార్థ్ కు తల్లిగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నారు దేవయాని.












Click it and Unblock the Notifications