ప్లీజ్ మా సినిమా నుంచి తప్పుకో..దేవీ శ్రీ ప్రసాద్‌కు మరో ఘోర అవమానం
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు టైం బ్యాడ్ నడుస్తుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు కష్టకాలం మొదలైనట్టే అని చర్చ సాగుతోంది.చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కల్యాణ్,ప్రభాస్ , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ సినిమాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాలని పట్టు పట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తమిళంలో కూడా దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో సత్తా చాటారు. అయితే గత కొంతకాలంగా దేవీ శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఆయన నుంచి పెద్దగా హిట్ మ్యూజిక్ రావడం లేదు.
దీంతో తెలుగు హీరోలు పూర్తిగా దేవీ శ్రీ ప్రసాద్‌ను దూరం పెట్టేశారు. ఇక తమిళంలో వరుస సినిమాలు చేస్తోన్న దేవీ శ్రీ ప్రసాద్‌కు సూర్య 'కంగువా' పెద్ద షాకిచ్చింది. 'కంగువా' బీజీఎమ్ బాలేదని విమర్శలు వచ్చాయి. సినిమా బాలేదనే టాక్ ఒక ఎత్తు అయితే దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు సెట్ కాలేదనేది ప్రధానంగా వినిపించింది. దీనిపై దేవీ శ్రీ ప్రసాద్ చాలానే ట్రోల్స్‌ను ఎదుర్కొవాల్సి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ని తప్పించడం సంచలనంగా మారింది. 'పుష్ప-2' సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ కేవలం పాటలకు మాత్రమే మ్యూజిక్ అందించారు.

థమన్ బీజీఎమ్ అందించనున్నారు. ఇది చాలదన్నట్టు తాజాగా మరో స్టార్ హీరో సినిమా నుంచి దేవీ శ్రీ ప్రసాద్ తప్పించినట్టు తెలుస్తోంది.తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం 'అగ్లీ' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న ప్రకారం దేవీ శ్రీ ప్రసాద్‌ను తప్పించి ఆయన స్థానంలో అనిరుథ్, లేదా జీవీ ప్రకాష్‌ను తీసుకునే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 'కంగువా' మ్యూజిక్ బాలేదని ఫీడ్ బ్యాక్ రావడం, 'పుష్ప-2' సినిమాలో కేవలం పాటలకు పరిమితం చేయడం ద్వారా దేవీ శ్రీ ప్రసాద్‌పై కొంత నెగిటివ్ ఏర్పడింది. తాజాగా అగ్లీ మూవీ నుంచి తొలగించడం ఆయన కెరీర్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.












Click it and Unblock the Notifications