రణ్‌బీర్ కపూర్‌తో ధనశ్రీ వర్మ ఆసక్తికర అనుభవం!
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, ప్రఖ్యాత డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. డ్యాన్సర్‌గా ప్రసిద్ధి చెందిన ధనశ్రీ వర్మ.. ఒకప్పుడు తాను డెంటిస్ట్‌గా ప్రాక్టీస్ చేసేదాన్ని అని.. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కు చికిత్స అందించానని వెల్లడించారు. ఈ విషయం విని ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఆశ్చర్యపోయారు.
రణ్‌బీర్ కపూర్‌కు దంత చికిత్స
తాజాగా ఫరా ఖాన్ తన వ్లాగ్‌లో భాగంగా ధనశ్రీ వర్మ ఇంటికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి వంట చేస్తూ తమ జీవితంలో జరిగిన సంఘటనలను పంచుకున్నారు. తన కెరీర్ గురించి ధనశ్రీ వర్మ వివరిస్తూ.. "నేను మూడు సంవత్సరాల పాటు దంత వైద్యురాలిగా పనిచేశాను. బాంద్రా, లోఖండ్‌వాలాలో నా క్లినిక్ ఉండేది. అక్కడ చాలా మంది టీవీ నటులు వచ్చేవారు. ఒకసారి నేను రణ్‌బీర్ కపూర్‌కు కూడా చికిత్స అందించాను" అని ధనశ్రీ వర్మ చెప్పారు.

ఈ విషయం విని ఆశ్చర్యపోయిన ఫరా ఖాన్.. "నువ్వు అతని నోటి లోపల చూశావా? ఎలా ఉంది?" అని అడిగారు. దీనికి ధనశ్రీ, "అది నా వృత్తిలో భాగం. అతని నోరు చాలా ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంది" అని సమాధానం ఇచ్చారు.
వైద్య వృత్తిని వదిలి డ్యాన్సర్‌గా..
ధనశ్రీ వర్మ ముంబైలోని డీవై పాటిల్ కాలేజీలో డెంటిస్ట్రీ చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక కొంతకాలం డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు. కానీ, తనలోని డ్యాన్స్ ప్యాషన్‌ను గుర్తించి, వైద్య వృత్తిని వదిలి డ్యాన్సర్‌గా మారారు. ఇప్పుడు ఆమె ఒక ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు.
యుజ్వేంద్ర చాహల్‌తో విడాకులు
తన వ్యక్తిగత జీవితం గురించి ధనశ్రీ వర్మ మాట్లాడుతూ.. 2020లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను పెళ్లి చేసుకున్నానని, 2025 మార్చిలో విడాకులు తీసుకున్నామని తెలిపారు. విడాకుల తర్వాత కూడా తాము టచ్‌లో ఉన్నామని, తాను ఇప్పటికీ చాహల్‌కు మెసేజ్‌లు పంపుతుంటానని చెప్పారు. చాహల్ తనను ప్రేమగా 'మా' అని పిలిచేవాడని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వృత్తిపరంగా, ధనశ్రీ త్వరలో 'రైజ్ అండ్ ఫాల్' అనే కొత్త రియాలిటీ షోలో కనిపించనున్నారు. ఈ షో సెప్టెంబర్ 6న అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో ప్రసారం కానుంది.












Click it and Unblock the Notifications