ఒకేచోట ధనుష్ - మృణాల్ ఠాకూర్..ఆ ఒక్క పోస్ట్‌తో పెళ్లిపై క్లారిటీ..!

తమిళ స్టార్ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒకరి పోస్టులకు మరొకరు లైకులు కొట్టడం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలియడంతో అందరూ షాక్ తిన్నారు. వీరిద్దరికీ ఎలా పరిచయమైందబ్బా అంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు. ఇటీవలే మృణాల్ ఠాకూర్ జన్మదిన వేడుకలు జరిగితే హీరో ధనుష్ హాజరయ్యారు. ఆ పార్టీలో వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా కనపడటంతో ఇద్దరూ కచ్చితంగా డేటింగ్ లోనే ఉన్నారనే వార్తలు జోరందుకున్నాయి. వారి సన్నిహితాన్ని చూసి అందరూ ఓకే అని ఖరారు చేసుకున్నారు.

పెళ్లి చేసుకోవడం ఖాయం
సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరికి సంబంధించిన వార్త ఏదో ఒకటి, ఎక్కడో ఒకచోట వైరలవుతూనే ఉంది. ఇంత జరుగుతున్నా వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా ధనుష్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా ఓ ఫొటో షేర్ చేశారు. ప్రస్తుతం అది సంచలనం సృష్టిస్తోంది. అది ఒక నలుపు, తెలుపు ఫొటో. రంగుల ఫొటో కాదు. అనుకోని సంఘటనలు కొన్ని అద్భుతాలను సృష్టిస్తాయంటూ దానికింద రాసుకొచ్చాడు. ఈ ఫొటోను మృణాల్ ఠాకూర్ లైక్ చేసింది. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం దీన్నిబట్టి ఖాయమైందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ అర్థం వచ్చేలానే క్యాప్షన్ పెట్టాడంటున్నారు.

Dhanush and Mrunal Thakur are getting married

ఆ ఫొటో తీసింది మృణాల్?
మరికొందరైతే ఆ ఫొటో తీసింది ఎవరో కాదని, మృణాలే తీసుంటుందంటున్నారు. తమిళ స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాజీ అల్లుడనే సంగతి తెలిసిందే. రజనీ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఇద్దరికీ మనస్పర్థలు రావడంతో ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లోనే ఉంటోంది. ధనుష్ కొత్తగా తన ఇంటిని రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించుకున్నాడు. 42 సంవత్సరాల వయసులో మృణాల్ ఠాకూర్ తో పెళ్లికి సిద్ధపడ్డాడు. వీరిద్దరి అన్యోన్య చూస్తున్న నెటిజన్లు చివరి వరకు కలిసుంటారేమో అంటూ చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+