ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి..?

తమిళ స్టార్ హీరో ధనుష్.. సీతారామం మూవీ హీరోయన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ‌త కొద్దిరోజులుగా వీరిద్ద‌రూ రిలేష‌న్ షిప్ లో ఉన్నట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని టాక్ వినిపిస్తోంది. గతంలోనూ వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగ్గా మృణాల్ ఠాకూర్ ఆ గాసిప్స్ ను ఖండించిన విషయం తెలిసిందే.

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని సమాచారం అందుతోంది. అయితే తాజా ప్రచారంపై ధనుశ్, మృణాల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో మాత్రం ఈ వార్తలపై మృణాల్ ఠాకూర్ ఖండించారు.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఇటీవల తెలుగులో కుబేర చిత్రంలో నటించారు. ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో ధనుష్ బిజీగా ఉన్నారు. ఇక ధనుష్ కు ఇదివరకే వివాహం జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వ‌ర్యను 2004లో పెళ్లి చేసుకున్నారు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా 2024లో ఐశ్వ‌ర్య‌కు విడాకులు ఇచ్చారు. ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌ల‌కు ఇద్ద‌రు కుమారులు కూడా ఉన్నారు.

Dhanush amp amp Mrunal Thakur Wedding Rumors Explode Valentine s Day 2026 Knot

ఇక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మృణాల్ సీతారామంతో టాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు నాలుగే సినిమాలు చేసిన ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగులో అడివి శేష్ డెకాయిట్‌ మూవీలో హీరోయిన్‌ గా న‌టిస్తోంది. ఇక మృణాల్ సినిమా ఈవెంట్స్ కు ధ‌నుష్ హాజరు కావ‌డంతో ఈ రూమ‌ర్స్‌ స్టార్ట్ అయ్యాయి. ధ‌నుష్ సిస్ట‌ర్స్‌ ను మృణాల్ ఇన్‌ స్టాలో ఫాలో కావ‌డంతో ఈ ప్రేమ వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+